Night Walk: రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ ఎలా చేయాలి?

|

Jul 05, 2024 | 1:35 PM

చాలా మందికి రాత్రి పూట వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. భోజనం చేశాక అలా ఓ ఐదు నిమిషాలు అయినా నడుస్తూ ఉంటారు. రాత్రి పూట భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకుండా.. వాకింగ్ చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కూర్చోవడం, పడుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి భోజనం చేసిన వెంటనే రిలాక్స్ అవ్వకుండా నడవడం చాలా మంచిది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా..

Night Walk: రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ ఎలా చేయాలి?
Night Walking
Follow us on

చాలా మందికి రాత్రి పూట వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. భోజనం చేశాక అలా ఓ ఐదు నిమిషాలు అయినా నడుస్తూ ఉంటారు. రాత్రి పూట భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకుండా.. వాకింగ్ చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కూర్చోవడం, పడుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి భోజనం చేసిన వెంటనే రిలాక్స్ అవ్వకుండా నడవడం చాలా మంచిది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. భోజనం చేసిన తర్వాత వాకింగ్ ఎలా చేయాలి? అనే సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. నెమ్మదిగా నడవాలా? వేగంగా నడవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ ఎలా చేయాలి? ఎలా నడవటం వల్ల లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వెంటనే చేయకూడదు:

వాకింగ్ చేయాలి అంటే చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే చేస్తారు. అలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపులో నొప్పి, వాంతులు వచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వాకింగ్ చేయడం కంటే. ఓ అరగంట లేదా గంట తర్వాత అయినా నడవడం మంచిది.

ఇలా నడవండి:

రాత్రి పూట భోజనం అయ్యాక చాలా మంది వాకింగ్ చేయడం మంచిదే. ఇలా అని చాలా మంది వేగంగా నడుస్తూ ఉంటారు. అలా అస్సలు నడవ కూడదు. చాలా నెమ్మదిగా నడవాలి. వేగంగా నడవటం వల్ల కడుపులో నొప్పి రావచ్చు. ఇలా నడవటం వల్లనే ప్రయోజనాలు అందుతాయి.

ఇవి కూడా చదవండి

జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:

రాత్రి పూట వాకింగ్ చేయడం వల్ల జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. ఇలా రాత్రి పూట వాకింగ్ చేస్తే.. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

వెయిట్ లాస్ అవుతారు:

రాత్రి పూట తిన్న తర్వాత వాకింగ్ చేయడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. దీంతో ఉదయం బాత్రూమ్ ఫ్రీగా అవుతుంది. పొట్ట కూడా తగ్గుతుంది. అంతే కాకుండా రాత్రి పూట వాకింగ్ చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది:

రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..