
అధిక స్క్రీన్ సమయం మెదడులోని రసాయన సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా డోపమైన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇది అడిక్షన్ (వ్యసనం) లాంటి లక్షణాలకు దారితీస్తుంది. నిద్రలేమి, ఏకాగ్రత లోపం, చిరాకు, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. చిన్నపిల్లల్లో అయితే మెదడు అభివృద్ధిపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి నిద్రను నియంత్రించే మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది.
రోజూ కొంత సమయం పాటు అన్ని స్క్రీన్‌లకు దూరంగా ఉండండి. ఇది మీ మెదడుకు విశ్రాంతినిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్రపోవడానికి ముందు స్క్రీన్ వాడకాన్ని తగ్గించండి.
నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్‌లు, ట్యాబ్‌లు, టీవీలు చూడటం మానేయండి. ఇది సహజ నిద్ర విధానాలకు సహాయపడుతుంది.
ప్రతి 20 నిమిషాల స్క్రీన్ సమయం తర్వాత, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. ఇది కళ్ళకు విశ్రాంతినిస్తుంది. కళ్ళ ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఇంట్లో ఉండి స్క్రీన్‌లకే అతుక్కుపోకుండా, బయట గడపడానికి ప్రయత్నించండి. ఆటలు ఆడటం, నడవడం, ప్రకృతితో సమయం గడపడం వంటివి చేయండి. ఇది మెదడును ఉత్తేజపరుస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
మీ డివైజ్‌లలో ఉండే స్క్రీన్ టైమ్ ట్రాకింగ్ యాప్‌లను ఉపయోగించి మీరు ఎంత సమయం స్క్రీన్ ముందు గడుపుతున్నారో తెలుసుకోండి. ఇది మీ వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇంట్లో కొన్ని ప్రదేశాలను (ఉదాహరణకు, బెడ్‌రూమ్, డైనింగ్ టేబుల్) “నో స్క్రీన్” జోన్‌లుగా ప్రకటించండి. ఆ ప్రదేశాలలో డిజిటల్ పరికరాలను వాడకుండా ఉండండి.
స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడానికి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, కొత్త హాబీలు నేర్చుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడటం వంటి ప్రత్యామ్నాయ కార్యకలాపాలను ఎంచుకోండి.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా స్క్రీన్ సమయం ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మీ మెదడు ఆరోగ్యాన్ని, మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు.