
తేనె, బెల్లం రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండూ శరీరానికి చేసే మంచి అంతా ఇంతా కాదు. వీటిల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తారు. మనం తరచూ ఉపయోగించే వాటిల్లో ఈ రెండూ కూడా ఉంటాయి. తేనె, బెల్లంతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా చాలా మంది ఈ రెండింటిని ఉపయోగిస్తారు. అయితే ఈ తేనె, బెల్లంలో ఏది మంచిది? అనే డౌట్ చాలా మందిలో వచ్చే ఉంటుంది. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మరి వీటిల్లో ఏది మరింత మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వంటల్లో మనం ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో బెల్లం కూడా ఒకటి. పూర్వం నుంచి బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పంచదారకు బదులు బెల్లం వాడటం చాలా మంచిది. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు బి1, బి6, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. బెల్లం తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. బెల్లం నీళ్ళు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలసట, నిరసం దూరమై శక్తి వస్తుంది. రక్తం పడుతుంది. శరీరంలో ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలు, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి.
తేనెను కూడా మనం తరచూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది నిమ్మ రసంలో తేనె కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. తేనె తీసుకోవడం వల్ల అందం కూడా పెరుగుతుంది. చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. బరువు తగ్గుతారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ కంట్రోల్ అవుతాయి. ఇతర వ్యాధులతో పోరాడేందుకు శక్తి లభిస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. తేనెను ఎలాంటి వారైనా తీసుకోవచ్చు. తేనెలో పొటాషియం, సోడియం, డైటరీ ఫైబర్, ప్రోటీన్, శ్యాచురేటెడ్ ఫ్యాట్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం లభిస్తాయి.
తేనె, బెల్లం రెండూ ఆరోగ్యానికి మంచివే. ఈ రెండింటిలో కూడా మంచి పోషకాలు లభిస్తాయి. కానీ వీటిల్లో క్యాలరీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరీ ఎక్కువగా తీసుకున్నా మంచిది కాదు. మితంగా తీసుకుంటేనే మంచిది. మీకు ఉన్న అవసరాల బట్టి వీటిని తీసుకోవడం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..