AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ చేతులను చూసి మీ శరీరంలో కొవ్వు ఎంత ఉందో చెప్పేయొచ్చు.. మీకు తెలియని హెల్త్ సీక్రెట్స్ ఇవే..

మనం ఆరోగ్యంగానే ఉన్నామని అనుకుంటాం.. కానీ మన రక్తంలో కొవ్వు నిశబ్దంగా పేరుకుపోతూ గుండెను ప్రమాదంలోకి నెడుతుంటుంది. అందుకే వైద్యులు కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. అయితే, ప్రాణాపాయం సంభవించే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. మన చేతులు, గోళ్లలో కనిపించే కొన్ని చిన్న మార్పులే మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థితిని చెప్పేస్తాయి.

మీ చేతులను చూసి మీ శరీరంలో కొవ్వు ఎంత ఉందో చెప్పేయొచ్చు.. మీకు తెలియని హెల్త్ సీక్రెట్స్ ఇవే..
High Cholesterol Signs On HandsImage Credit source: Getty Images
Krishna S
|

Updated on: May 02, 2026 | 3:53 PM

Share

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య కొలెస్ట్రాల్. దీనిని వైద్యులు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది శరీరంలో పెరిగే వరకు ఎటువంటి తీవ్రమైన నొప్పిని కలిగించదు.. కానీ ఒక్కసారిగా గుండెపోటు లేదా స్ట్రోక్ రూపంలో ప్రాణాపాయం తెచ్చిపెడుతుంది. ప్రముఖ డాక్టర్ ఫ్రెడరిక్ మండుకా ప్రకారం.. మన శరీరం ఇచ్చే కొన్ని చిన్న చిన్న సంకేతాల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను ముందే గుర్తించవచ్చు. ముఖ్యంగా మన చేతులు ఈ విషయంలో కీలక ఆధారాలను చూపిస్తాయి.

చేతులపై కనిపించే ఆ మార్పులేమిటి..?

రక్తంలో కొవ్వు స్థాయిలు మితిమీరినప్పుడు మన చేతులు, వేళ్లపై కొన్ని మార్పులు కనిపిస్తాయి.

పసుపు రంగు గడ్డలు: మోచేతులు లేదా వేళ్ల కీళ్లపై చిన్న చిన్న పసుపు లేదా నారింజ రంగు గడ్డలు, బొబ్బలు కనిపిస్తాయి. వీటిని వైద్య పరిభాషలో జాంతోమాస్ అంటారు. ఇవి నొప్పి కలిగించవు కాబట్టి చాలామంది వీటిని సాధారణ అలర్జీగా భావించి పొరబడతారు.

నరాల వాపు: వేళ్లను నిటారుగా ఉంచే నరాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల అవి మందంగా మారుతాయి. దీనివల్ల వేళ్ల కదలికలో ఇబ్బంది కలగడమే కాకుండా, తిమ్మిర్లు మరియు నొప్పి వస్తుంటాయి.

గోళ్ల రంగు మారడం: రక్త ప్రసరణ సరిగ్గా అందకపోతే గోళ్లు పాలిపోవడం లేదా అకస్మాత్తుగా విరిగిపోవడం జరుగుతుంది. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు ఒక ప్రధాన సూచన.

కళ్లు, కాళ్లలో కూడా సంకేతాలు..

చేతులతో పాటు శరీరంలోని ఇతర భాగాలు కూడా కొలెస్ట్రాల్ హెచ్చరికలను జారీ చేస్తాయి.

కళ్ల చుట్టూ మచ్చలు: కనురెప్పల పైన లేదా కింద పసుపు రంగు మచ్చలు కనిపించడం.

కంటి వలయం: కంటి పాప చుట్టూ బూడిద లేదా తెల్లటి వలయం ఏర్పడటం.

కాళ్ల నొప్పి: నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లలో విపరీతమైన బలహీనత, నొప్పి రావడం.

గుండె ఇచ్చే హెచ్చరికలు

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తప్రసరణకు అడ్డంకి కలిగినప్పుడు.. ఛాతీ నొప్పి , కొంచెం పని చేసినా తీవ్రమైన ఆయాసం, అలసట, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది గుండెపోటుకు దారితీయవచ్చు.

కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడం ఎలా..?

ఆహార నియమాలు: నూనె పదార్థాలు, బేకరీ ఫుడ్స్, అధిక కొవ్వు ఉండే మాంసాహారాన్ని తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఓట్స్, బీన్స్, మరియు నట్స్ తీసుకోవాలి.

శారీరక శ్రమ: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

పరీక్షలు: లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకుండా, నిర్ణీత సమయాల్లో లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి.

మీ చర్మంపై లేదా చేతులపై పైన పేర్కొన్న మార్పులు ఏవైనా గమనిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.

(గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం, వివిధ ఆరోగ్య నిపుణులు, నివేదికల ఆధారంగా అందించబడింది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.  మీకు ఏవైనా సందేహాలు ఉంటే, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించండి.)

Follow Us