Trisha: మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్.. అసలు ఏం జరిగిందంటే?
ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది స్టార్ హీరోయిన్ త్రిష. ముఖ్యంగా టీవీకే అధినేత విజయ్ దళపతితో ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని తమిళనాట తీవ్ర ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతలోనే..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ‘కరుప్పు’. తెలుగులో వీరభద్రుడుగా రిలీజ్ కానుంది. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సూర్యతో సహా చిత్ర బృందమంతా హాజరైంది. అయితే హీరోయిన్ త్రిష మాత్రం రాలేదు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటుందని కొంతమంది నెటిజన్లు ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు విషయమేమిటంటే.. కరుప్పు మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్ కు త్రిషకు అసలు ఆహ్వానమే అందలేదట. ఇదే విషయాన్ని త్రిష ఇన్ డైరెక్టుగా చెబుతూ సోషల్ మీడియా వేదికగా కరుప్పు టీమ్ పై సెటైర్లు వేసింది.
సినిమా ప్రమోషన్లలో భాగంగా కరుప్పు మేకర్స్ త్రిషకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె ప్రీతి అనే లాయర్ పాత్రలో కనిపించనుంది. 43 ఏళ్ల త్రిష ఈ వీడియోలో ఎంతో యంగ్ గా , అందంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ త్రిష లుక్ పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘కరుప్పు’ సినిమాలో త్రిష ఉందన్న విషయమే మర్చిపోయాను. ఆమె ఏజ్ రివర్స్ గేర్‌లో వెళ్తోంది’ అని ట్వీట్ చేశారు. దీనికి త్రిష ఇలా రిప్లై ఇచ్చింది. ‘ థ్యాంక్స్.. నేనూ మర్చిపోయాను. కనీసం ఇప్పటికైనా వారు ఇలా గుర్తు చేసినందుకు సంతోషంగా ఉంది’ అని సెటైరికల్ గా కామెంట్ చేసింది త్రిష.
ఇదే క్రమంలో సూర్య అభిమాని ఒకరు స్పందిస్తూ.. ‘ఆడియో లాంచ్‌కే రాని మీకు ఇంత వెటకారం అవసరమా?’ అని ప్రశ్నించాడు. దానికి త్రిష ఆన్సర్ ఇస్తూ.. ‘నా ఇన్విటేషన్ బహుశా మెయిల్‌లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందిలే’ అని రిప్లై ఇచ్చింది. తద్వారా తనను ఆ వేడుకకు ఆహ్వానించలేదనే విషయాన్ఇన ఇన్ డైరెక్టుగా చెప్పింది. దీనిపై త్రిష ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆడియో లాంచ్ పోస్టర్లలో ఆమె పేరున్నప్పటికీ, పిలవకుండా పోస్టర్లు వేస్తే ఎలా వస్తారని త్రిష ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక స్టార్ హీరోయిన్‌ని ఇలా అవమానిస్తారా?’, ‘సూర్య ఈ విషయంపై స్పదించాలి’ అని డిమాండ్ చేస్తున్నారు.
త్రిష ట్వీట్..
Thank you ☺️ Even I forgot.Good to know they set a reminder now atleast😅 https://t.co/vAgpPJiJJ9
— Trish (@trishtrashers) May 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




