Healthy Liver : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు ఆహారాలు తప్పనిసరి..! ఏంటో తెలుసుకోండి..

Healthy Liver : మన శరీర శక్తి కేంద్రం కాలేయం. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Healthy Liver : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు ఆహారాలు తప్పనిసరి..! ఏంటో తెలుసుకోండి..
Healthy Liver
Follow us

|

Updated on: Jun 08, 2021 | 8:19 PM

Healthy Liver : మన శరీర శక్తి కేంద్రం కాలేయం. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాలను నిల్వ చేయడానికి, బ్యాక్టీరియాను తొలగించడానికి పనిచేస్తుంది. ఈ ఎంజైమ్ జీవక్రియ రేటును నిర్ణయిస్తుంది. కాలేయం మన శరీరంలో 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడం, విషాన్ని తొలగించడం, గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడం, ప్రోటీన్ పోషణను సమతుల్యం చేయడం కాలేయం విధులు. కాలేయం చాలా ముఖ్యమైన విధుల కారణంగా దానిని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవడం అవసరం.

1. కాలేయానికి బీట్‌రూట్ అవసరం: శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి బీట్‌రూట్ ఉత్తమమైన ఆహారం. మీరు బీట్‌రూట్ జ్యూస్ తాగినప్పుడు లేదా సూప్ తాగినప్పుడు మీకు విటమిన్ సి, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. బీట్‌రూట్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది అలాగే జీర్ణక్రియకు ఇది చాలా మంచిది.

2. వెల్లుల్లి: వెల్లుల్లిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. రోజూ ఒక ఒక వెల్లుల్లి రిబ్బ తినడం ద్వారా మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది చాలా సెలీనియం కలిగి ఉంటుంది ఇది కాలేయం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది.

3. కాలేయానికి ఆకుపచ్చ కూరగాయలు ముఖ్యమైనవి: బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో ఇనుము, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మీ కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి.

4. కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే వాటిని ఆహారంలో నివారించండి. ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాన్ని నివారించడం అవసరం. తక్కువ సోడియం ఉన్న ఆహారాన్ని ఎంచుకోండి. తక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల కాలేయంపై ఎక్కవ భారం పడకుండా ఉంటుంది.

5. బెర్రీని ఉపయోగించండి: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, కోరిందకాయలు మీ కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి. ఇది మాత్రమే కాదు కాలేయం నుంచి విషాన్ని తొలగిస్తుంది జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచుతుంది.

TS Cabinet Meeting Live: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్.. లాక్‌డౌన్‌ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్

CBI Recruitment 2021: సీబీఐలో అడ్వైజ‌ర్ పోస్టులు.. ఎవ‌రికీ అవ‌కాశం.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే.. 

World Record: రికార్డు బ్రేక్‌.. ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.. ఆశ్యర్యపోయిన వైద్యులు

Latest Articles