Hair Care: మీ జుట్టును ఒత్తుగా, బలంగా మార్చే అద్భుతమైన చిట్కా.. రూపాయి కూడా ఖర్చుండదు.. అస్సలు మిస్ అవ్వొద్దు..

|

Apr 17, 2023 | 2:04 PM

బియ్యం నీళ్లు మీ జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. పొడవుగా పెరిగేలా చేస్తాయి. పట్టులా మెరిసేలా చేస్తాయి. జపాన్ లో పురాతన కాలం నుంచి దీనిని ఓ మంచి చిట్కాగా మహిళలు వినియోగిస్తున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Hair Care: మీ జుట్టును ఒత్తుగా, బలంగా మార్చే అద్భుతమైన చిట్కా.. రూపాయి కూడా ఖర్చుండదు.. అస్సలు మిస్ అవ్వొద్దు..
Hair Care Tips
Follow us on

శిరోజాలు మహిళల అందాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే వాటిని మహిళలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ ఒక్కసారి ఊడిపోవడం మొదలైతే దానిని ఆపడం చాలా కష్టమైన పని. సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల లేదా తినే ఆహారంలో మార్పులు, హార్పోన్ల అసమతుల్యత కారణాలుగా వెంట్రుకలు చిట్లిపోతూ రాలిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో మహిళలు ఇంటి చిట్కాలతో పాటు రకరకాల షాంపూలు, నిపుణుల సూచనలు, యూట్యూబ్ సూచనలు పాటిస్తూ.. తమ శాయశక్తులా జట్టును కాపాడుకునేందుకు తాపత్రయ పడతారు. అయితే అలాంటి వారి కోసమే ఓ బెస్ట్ రెమిడీ మీకు అందిస్తున్నాం. ఇది కూడా ఇంటి చిట్కానే. కానీ జపనీస్ వారు ఎక్కువగా ఉపయోగించే చిట్కా. అదే బియ్యం నీళ్లు. బియ్యం నీళ్లతో జట్టు ఆరోగ్యమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? పురాతన కాలం నుంచి జపాన్ ఇది బెస్ట్ రెమిడీగా ఉంది. దీనిని ఎలా ఉపయోగించాలి. వారంలో ఎన్నిసార్లు వాడాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

జుట్టు ఆరోగ్యం పదిలం..

బియ్యం నీళ్లు మీ జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. పొడవుగా పెరిగేలా చేస్తాయి. పట్టులా మెరిసేలా చేస్తాయి. జపాన్ లో పురాతన కాలంలోని మహిళలు తమ జుట్టును ఇలాగే కాపాడుకునేవారట. బియ్యం నీటిలో జుట్టుకు అవసరమయ్యే ఎన్నో రకాల ఖనిజాలు, విటమిన్ బి, సి, ఈలతో పాటూ యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అధ్యయనాల ప్రకారం బియ్యం నీటిని క్రమం తప్పకుండా వాడడం వల్ల జుట్టు మందంగా పెరుగుతుంది. అలాగే ఇందులోని ఇనోసిటాల్ దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పర్యావరణ ఒత్తిళ్ల వల్ల జుట్టు చిట్లకుండా లేదా చివర్లు చీలిపోకుండా కాపాడతాయి. అమైనో ఆమ్లాలు దెబ్బతిన్న జుట్టు కుదుళ్లను పునరుత్పత్తి చేయడంలో సహాయపడతాయి. దురద, చికాకు, చుండ్రు వంటి స్కాల్ప్ సమస్యలను నిరోధిస్తాయి.

ఇలా తయారు చేసుకోండి..

బియ్యాన్ని ఫిల్టర్ చేసిన నీటిలో వేసి ఉడకబెట్టాలి. బాగా మరిగిన తర్వాత బియ్యాన్ని వడగట్టి.. నీటిని వేరు చేసి చల్లార్చాలి. ఆ తర్వాత ఆ బియ్యం నీటిని స్ప్రే బాటిల్ లో నింపాలి. ఇప్పుడు మీ తరచూ వాడే తక్కువ సాంధ్రత కలిగిన షాంపూతో తల స్నానం చేసి, జుట్టును బాగా కడగాలి. ఆ తర్వాత బియ్యం నీటిని తలపై స్ప్రే చేసి మృదువుగా మసాజ్ చేయాలి. బాగా కింది నుంచి పై వరకూ మసాజ్ చేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

ఇవి కూడా చదవండి

ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

ఈ మిరాకిల్ వాటర్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విరిగిపోవడం, చిట్లపోవడాన్ని తగ్గిస్తుంది. జుట్టు మూలాలను బలపరుస్తుంది. స్కాల్ప్ మృదుత్వాన్ని పెంచుతుంది. మెరిసేలా చేస్తుంది. ఇందులోని ప్రొటీన్లు, మినరల్స్ వంటి పోషకాలు చుండ్రు చికిత్సకు సహజ చికిత్సగా ఉపయోగపడతాయి. రైస్ వాటర్ జుట్టు డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది. తేమ వంతంగా మారుస్తుంది. తద్వారా జుట్టు మెరిసేలా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..