IRCTC Tours: లవ్లీ లడ్డాఖ్‌ను చూసొద్దామా.. హైదరాబాద్ నుంచి డైరెక్ట్‌గా విమానంలో.. ఐర్‌సీటీసీ అందిస్తున్న సూపర్ ప్యాకేజీ గురించి తెలుసుకోండి..
ఇటీవల కాలంలో అతి తక్కువ ధరలోనే పర్యాటకులకు అనేక ప్రాంతాలను పరిచయం చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజమ్. తాజాగా హైదరాబాద్ నుంచి లడ్డాఖ్ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘లేహ్ విత్ టర్టుక్’ పేరుతో ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు సాగేలా ఈ ప్యాకేజీని డిజైన్ చేసింది. విమానంలో తీసుకెళ్లడంతో పాటు అక్కడ అన్ని వారే చూపించి, తిరిగి హైదరాబాద్‌లో దించేలా ప్యాకేజీ ఉంది.

జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రాంతాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతిని అధికంగా ప్రేమించేవారికి ఆ జాబితా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందులో తప్పనిసరిగా ప్రకృతి వరప్రసాదిని అయిన లడ్డాఖ్ ప్రాంతం ఉండి తీరుతుంది. తెల్లని మంచుదుప్పటి కప్పేసి ఉండే ఆ ప్రాంత అందాలు చూడాలే గాని వర్ణించడం కష్టం. అయితే అక్కడకువెళ్లాలంటే మాత్రం ముందు ప్రిపరేషన్ అవసరం. అయితే ఇటీవల కాలంలో అతి తక్కువ ధరలోనే పర్యాటకులకు అనేక ప్రాంతాలను పరిచయం చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజమ్. తాజాగా హైదరాబాద్ నుంచి లడ్డాఖ్ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘లేహ్ విత్ టర్టుక్’ పేరుతో ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు సాగేలా ఈ ప్యాకేజీని డిజైన్ చేసింది. విమానంలో తీసుకెళ్లడంతో పాటు అక్కడ అన్ని వారే చూపించి, తిరిగి హైదరాబాద్‌లో దించేలా ప్యాకేజీ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐఆర్‌సీటీసీ టూరిజమ్ లడ్డాఖ్ టూర్ వివరాలు..
ప్యాకేజీ పేరు: లేహ్ విత్ టర్టుక్ (ఎస్‌హెచ్‌ఏ41ఏ)
వ్యవధి: ఆరు రాత్రులు/ఏడురోజులు
ప్రయాణ సాధనం: విమానం
టూర్ తేదీలు: ఆగస్టు 18, సెప్టెంబర్ 07, 22
కవరయ్యే ప్రాంతాలు: లేహ్, నుబ్రా, పాంగోంగ్, టర్టుక్
టూర్ ప్రారంభం: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు
ప్రయాణం సాగేదిలా..
డే1(హైదరాబాద్ – లేహ్): హైదరాబాద్ విమానాశ్రయంలో ఉదయం 06.45 గంటలకు ప్రారంభమై 12.30కి లేహ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. హోటల్ వెళ్లి తగినంత విశ్రాంతి తీసుకుంటారు.
డే2(లేహ్- షామ్ వ్యాలీ- లేహ్ ): ఉదయం అల్పాహారం తర్వాత లేహ్-శ్రీనగర్ హైవేలో సందర్శనా స్థలాలను తిలకిస్తారు.. హాల్ ఆఫ్ ఫేమ్ (భారత సైన్యం అభివృద్ధి చేసిన మ్యూజియం), జోరావర్ కోట,గురుద్వారా పత్తర్ సాహిబ్ (భారత సైన్యం నిర్మించి నిర్వహించే గురుద్వారా) సందర్శిస్తారు. శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్ తిలకిస్తారు. మాగ్నెటిక్ హిల్ ప్రభావాలను అనుభవిస్తారు. పవిత్ర సింధు, జన్స్కార్ సంగమాన్ని తిలకించి, తిరిగి లేహ్ చేరి రాత్రి బస చేస్తారు.
డే3(లేహ్-నుబ్రా): అల్పాహారం తర్వాత, ఖర్దుంగ్లా పాస్ మీదుగా నుబ్రా వ్యాలీకి వెళ్తారు. ఈ రహదారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు రహదారిగా పరిగణించబడుతుంది. మార్గంలో ఖర్దుంగ్లా పాస్ చుట్టూ ఎత్తైన పర్వత శ్రేణులను చూడవచ్చు. మధ్యాహ్న భోజనం తర్వాత భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో నివసించే ప్రజల జీవన శైలిని చూడటానికి ఆ ప్రదేశం చుట్టూ షికారు చేయడానికి దీక్షిత్ , హందర్ గ్రామాలను, మఠాలను సందర్శించవచ్చు.. సాయంత్రం ఒంటె సఫారీని ఆనందించవచ్చు. నుబ్రా వ్యాలీలో నే రాత్రి బస చేస్తారు.
డే 4(నుబ్రా – టర్టుక్ – నుబ్రా): అల్పాహారం తర్వాత టర్టుక్ (1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం గెలిచిన గ్రామం)కి వెళ్తారు. మార్గంలో సియాచిన్ వార్ మెమోరియల్, థాంగ్ జీరో పాయింట్ సందర్శిస్తారు. బాల్టీ హెరిటేజ్ హౌస్, మ్యూజియం, సహజ శీతల గిడ్డంగిని సందచవచచు. అనంతరం నుబ్రాకి తిరిగి వెళ్లి రాత్రి బస చేస్తారు.
డే 5(నుబ్రా వ్యాలీ – పాంగాంగ్): అల్పాహారం తీసుకున్న తర్వాత అతి పెద్ద పాంగోంగ్ అనే ఉప్పు నీటి సరస్సు ను తిలకించవచ్చు.. ఇది భారతదేశం & చైనా మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా ఉంది. పాంగాంగ్‌లోనే రాత్రి బస చేస్తారు.
డే6(పాంగోంగ్- చాంగ్లా లేహ్): ఉదయాన్నే పాంగోగ్ సరస్సుపై సూర్యోదయం సుందరమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. అల్పాహారం తర్వాత, లేహ్‌కు తిరిగి వెళ్తారు. మార్గంలో థిక్సే మొనాస్టరీ, షే ప్యాలెస్, రాంచో స్కూల్‌లను సందర్శించండి. మార్కెట్‌ను తిలకించడానికి సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. రాత్రికి లేహ్‌లో బస చేస్తారు.
డే7(తిరుగు ప్రయాణం): అల్పాహారం తర్వాత లేహ్ విమానాశ్రయ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.
టూర్ లో కల్పించేవి.. విమాన ఛార్జీలు (హైదరాబాద్- లేహ్- హైదరాబాద్), వసతి, షేరింగ్ ప్రాతిపదికన నాన్ ఏసీ వాహనంలో లోకల్ ప్రయాణం, ట్రావెల్ ఇన్సురెన్స్ వంటివి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఐర్ సీటీసీ టూరిజమ్ వెబ్ సైట్ సందర్శించండి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- అక్కడికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులు ఉండాలి.
- మీరు లేహ్‌కు చేరుకున్న మొదటి రోజు పూర్తి విశ్రాంతి తీసుకోండి. మీ శరీరం తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు అలవాటుపడాలి.
- మీకు రక్తపోటు సమస్య ఉంటే, ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
- లడఖ్‌లో పర్వతారోహణ & ట్రెక్కింగ్ కోసం రక్షణ, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
- లడఖ్ ప్రాంతం తక్కువ ఆక్సిజన్‌తో కూడిన ఎత్తైన శీతల ఎడారి. ఈ అరుదైన వాతావరణం వల్ల అక్యూట్ మౌంటైన్ సిక్‌నెస్ వంటి అధిక ఎత్తులో ఉండే అనారోగ్యాలు ఏర్పడవచ్చు, అలవాటు చేసుకోలేని సందర్శకులను తక్షణమే తరలించాల్సిన అవసరం ఉంది.
టూర్ ప్యాకేజీలు ఇలా..
సింగిల్ ఆక్యూపెన్సీ కంఫర్ట్ క్లాస్ కి రూ. 46,110 చార్జ్ చేస్తారు. అదే డబుల్ షేరింగ్ ఒక్కొక్కరికీ రూ. 41,835 ఉంటుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కక్కరికీ రూ. 41,355 ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల వయస్సున్న పిల్లలకు మంచం కావాలంటే రూ. 40,215 చార్జ్ చేస్తారు. రెండు నుంచి నాలుగేళ్ల వయసున్న చిన్నారులకు మంచం అవసరం లేకపోతే రూ. 36020 తీసుకుంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







