
చాలా మందికి ఏదైనా తిన్న తర్వాత కడుపులో, ఛాతి భాగంలో మంటగా అనిపిస్తుంది. ఇది ఒక సాధారణమైన ఆరోగ్య సమస్య. కానీ, దీనిని నిర్లక్ష్యం చేయటం కూడా అంత మంచిది కాదని అంటున్నారు వైద్యులు. తిన్న తర్వాత ఛాతిలో మండటానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.. ప్రధానంగా కడుపులో యాసిడ్ స్థాయి పెరిగిపోయినప్పుడు తినగానే కడుపులో మంటగా ఉంటుంది. అన్నవాహికలో ఆమ్లం రావడం వల్ల ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేటి ఆధునిక ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఛాతిలో మంట పెద్ద సమస్యగా మారకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఛాతిలో మంట రావడానికి ప్రధాన కారణాల్లో టైమ్‌కి ఆహారం తీసుకోకపోవడమే అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల కడుపులో అల్సర్ లెవల్స్ పెరుగుతాయి. ఇది ఛాతిలో మంటకు దారి తీస్తుందని చెబుతున్నారు. అందుకే వేళకు భోజనం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, కొంతమంది తిన్న వెంటనే పడుకోవడం వంటివి చేస్తారు..తద్వారా యాసిడ్ అన్నవాహికలోకి వచ్చేస్తుంది. దీనివల్ల కడుపులో మంట, తేన్పులు, గొంతు నొప్పి రావచ్చు.
అదేవిధంగా ఎక్కువగా మసాలాలు కారం వంటివి తినడం వల్ల కూడా కడుపు, ఛాతీలో మంటగా ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహారంలో తక్కువ కారం, మసాలాలు తగ్గించుకోవాలి. తద్వారా ఈ ఇబ్బంది ఉండదు. అలాగే, క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేయడాన్ని తప్పనిసరి. వాకింగ్ చేయడం వల్ల కూడా ఛాతిలో మంట సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు. ఒకవేళ ప్రమాదం మరింత పెరిగినట్లు అనిపిస్తే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ని వెంటనే సంప్రదించండి.
(NOTE: ఇందులోని విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలున్నా నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..