సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ ఓట్స్​ పూరీలు.. చేయటం ఈజీ.. లాభాలు బోలెడు..!

ఓట్స్‌లో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. ఓట్స్‌లో ఉండే ప్రోటీన్స్ శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. అందుకే ఓట్స్‌ని చాలా మంది తమ రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఓట్స్‌తో ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు. కానీ, ఓట్స్‌తో పూరీలు కూడా చేస్తారని మీకు తెలుసా..? వీటితో తయారు చేసే పూరీలు మంచి ఆరోగ్యంతో పాటు సూపర్​ టేస్టీగా ఉంటాయి. మరి లేట్​ చేయకుండా ఈ సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ ఓట్స్​ పూరీలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ ఓట్స్​ పూరీలు.. చేయటం ఈజీ.. లాభాలు బోలెడు..!
Oats Puri

Updated on: Nov 03, 2025 | 8:44 PM

ఆహారంలో భాగంగా ఓట్స్‌ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మంచి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. దీనిలో విటమిన్ బి సహజంగా లభిస్తుంది. దానితో పాటుగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఖనిజాల శాతం కూడా అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కూడా ఓట్స్‌ మంచి పౌష్టికాహారం. ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఓట్స్‌లో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. ఓట్స్‌లో ఉండే ప్రోటీన్స్ శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. అందుకే ఓట్స్‌ని చాలా మంది తమ రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఓట్స్‌తో ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు. కానీ, ఓట్స్‌తో పూరీలు కూడా చేస్తారని మీకు తెలుసా..? వీటితో తయారు చేసే పూరీలు మంచి ఆరోగ్యంతో పాటు సూపర్​ టేస్టీగా ఉంటాయి. మరి లేట్​ చేయకుండా ఈ సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ ఓట్స్​ పూరీలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

ఓట్స్ పిండితో చాలామంది రోటీలను తయారు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది వివిధ వంటకాల్లో వినియోగిస్తారు. ఓట్స్ పిండితో పూరీలు కూడా ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చునని మీకు తెలుసా..? వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఓట్స్ పిండితో పూరీలు తయారీ విధానం, కావలసిన పదార్థాలేంటో ఇక్కడ చూద్దాం…

ఓట్స్‌ పూరీలకు కావాల్సిన పదార్థాలు ఓట్స్ 1 కప్పు పిండి, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంతా తీసుకోవాలి. ఒక టీ స్పూన్‌ ఆయిల్‌ కూడా తీసుకోవాలి. పిండి కలపడానికి వాడుకోవాలి. సరిపడా నీళ్లు, పూరీలు వేయించడానికి కావాల్సినంత నూనె కూడా కావాలి. ఇప్పుడు పిండి కలపడానికి సరిపడా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా తడుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ముందుగా ఒక బౌల్లో అన్ని ఓట్స్‌ పిండి, గోధుమ పిండి వేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే పిండిలో తగినంత నీటిని పోసుకుంటూ రోటీల పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవలసి ఉంటుంది. పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 20 నిమిషాల పాటు పక్కన పెట్టి.. ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకుని.. పూరీల ఆకారంలో ఒత్తుకోవాలి.

పూరీల ఆకారంలో ఒత్తుకున్న తర్వాత స్టవ్‌పై పెద్ద బాండి పెట్టుకొని.. అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆ పూరీలను అందులో వేస్తూ రెండు వైపులా మంచి రంగుతో కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న తర్వాత వేడివేడిగా మీకు నచ్చిన కర్రీ, చట్నీతో సర్వ్‌ చేసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..