ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి వేగంగా మారుతోంది. పెరుగుతున్న పని ఒత్తిడి, మారుతున్న పని విధానం ప్రజల జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. దీని ప్రభావం వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. జీవనశైలిలో మార్పులతో పాటు, తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. మైగ్రేన్ నొప్పి కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలలో ఒకటి. ఈ రోజుల్లో చాలా మంది మైగ్రేన్‌తో ఇబ్బందిపడుతున్నారు. ఇది సాధారణంగా వికారం, వాంతులు, కాంతికి తీవ్ర సున్నితత్వంతో కూడిన తలనొప్పిని కలిగిస్తుంది. దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. కాబట్టి, ఇది జీవనశైలి మార్పులు, కొన్ని ఔషధాల సహాయంతో నియంత్రించే అవకాశం మాత్రమే ఉంటుంది. ఇది కాకుండా, మైగ్రేన్ తలనొప్పికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పార్శ్వపు నొప్పికి కారణమయ్యే కొన్ని ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం..
టెన్షన్..
ప్రస్తుతం ప్రజలు అనుభవిస్తున్న అస్తవ్యస్తంగా మారిన జీవశైలి ప్రదాన కారణం. పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీని కారణంగా, ప్రజలు తరచుగా ఒత్తిడి, నిరాశకు గురవుతుంటారు. ఇది మైగ్రేన్ ప్రారంభానికి దోహదం చేస్తుంది.
నిద్రలేమి కూడా..
ఆరోగ్యంగా ఉండటానికి మంచి, ప్రశాంతమైన నిద్ర చాలా ముఖ్యం. కానీ, దిగజారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది నిద్రలేమితో ఇబ్బందిపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో సక్రమమైన నిద్రలేకపోవడంఒ, చాలి చాలని నిద్ర, లేదంటే అతిగా నిద్రపోయే వారిలో పార్శ్వపు నొప్పికి ట్రిగ్గర్‌గా పని చేస్తుంది.
హార్మోన్లలో మార్పులు..
హార్మోన్లలో మార్పులు కూడా మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. ఈస్ట్రోజెన్‌లో హెచ్చుతగ్గులు మైగ్రేన్ నొప్పికి దోహదం చేస్తాయి. మహిళలు సాధారణంగా ఋతుస్రావం, గర్భధారణ లేదా రుతువిరతి సమయంలో ఎక్కువగా మైగ్రేన్‌తో ఇబ్బందిపడుతుంటారు.
పర్యావరణ కారకాలు..
కొన్నిసార్లు కొన్ని పర్యావరణ కారకాలు కూడా మైగ్రేన్ నొప్పిని ప్రేరేపిస్తాయి. ప్రకాశవంతమైన కాంతి, పెద్ద శబ్దం, బలమైన వాసన, వాతావరణ నమూనాలలో మార్పు మొదలైన వాటి కారణంగా కూడా మైగ్రేన్ దాడికి గురవుతుంటారు.
కొన్ని ఆహార పదార్థాలు..
మైగ్రేన్ భరించలేని నొప్పిని కలిగిస్తుంది. మైగ్రేన్ అనేది చాలా మందిని తరచుగా ఇబ్బంది కలిగించే ఒక సాధారణ సమస్య. దీని వల్ల కలిగే నొప్పి భరించలేనంతగా ఉండడం వల్ల రోజువారీ పనులు చేయడం కూడా కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో మైగ్రేన్‌కు కారణమయ్యే కొన్ని ట్రిగ్గర్‌ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, మైగ్రేన్ నొప్పిని కలిగించే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన జున్ను, ప్రాసెస్ చేసిన మాంసాలు, కృత్రిమ స్వీటెనర్లు, సున్నితమైన వ్యక్తులలో మైగ్రేన్‌లను ప్రేరేపిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..