Liver Problems: మారిన జీవనశైలి కారణంగా ప్రజలలో కాలేయ వ్యాధి సాధారణ సమస్యగా మారింది. పూర్వ కాలంలో హెపటైటిస్ బి, సి కారణంగా కాలేయ సమస్యలు ప్రజలను ఇబ్బంది పెట్టేవి. ప్రస్తుతం సరైన ఆహారం తీసుకోకవడం వల్ల ఊబకాయం పెరుగుతోంది. దీని కారణంగా చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం కూడా కాలేయ వ్యాధికి కారణం. అయితే కాలేయ సమస్యలకు కారణమేంటో, దాని లక్షణాలు ఎలా ఉంటాయో తప్పక తెలుసుకోవాలి. కాలేయ వ్యాధి సమయంలో వైద్యుని సలహాపై చికిత్సను అనుసరించడం చాలా ముఖ్యం అయినప్పటికీ అనేక హోం రెమిడిస్ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
1. పసుపు
పసుపు శరీరానికి సంబంధించి అనేక వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. గాయాలను నివారించడంలో పసుపు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు పసుపు పాలు తాగాలి. ఎందుకంటే ఇది కాలేయానికి సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది.
2. కలబంద
కలబందలో హైడ్రేటింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయాన్ని పెద్ద నష్టాల నుంచి రక్షిస్తుంది. కావాలంటే మీరు కలబంద రసాన్ని మీ దినచర్యలో భాగంగా తీసుకోవచ్చు.
3. ఉసిరి
ఉసిరి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాలేయాన్ని చురుకుగా పనిచేసేలా చేస్తుంది. దాని పనితీరును మెరుగుపరుస్తుంది. దీనిని పొడి లేదా డికాక్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
4. వెల్లుల్లి
వెల్లుల్లి సహాయంతో లివర్ ఎంజైమ్ లను యాక్టివేట్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదనంగా ఇది శరీరం నుంచి టాక్సిన్స్‌ని తొలగిస్తుంది. దీన్ని సరైన మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
5. ఎక్కువ నీరు తాగాలి
ప్రతి ఆరోగ్య సమస్యకు నీరు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. కాలేయ వ్యాధులను ఎదుర్కొంటున్న రోగులు ఎక్కువగా నీరు తాగాలని వైద్యులు సలహా ఇస్తారు. మీరు కూడా ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఖచ్చితంగా రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని గుర్తుంచుకోండి.