Lemon: భోజనానికి ముందు నిమ్మరసం తాగితే.. ఏమవుతుంతో తెలుసా.?

దీంతో ఎన్నో రకాల మందులను ఉపయోగించే పరిస్థితి ఉంది. అయితే ఒక నేచురల్ చిట్కాను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. భోజనానం చేసే 30 నుంచి 40 నిమిషాల ముందు ఒక గ్లాస్‌ లెమన్‌ వాటర్‌ తాగాలని సూచిస్తున్నారు. ఇలా తాగడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారంగా లభిస్తుందని అంటున్నారు...

Lemon: భోజనానికి ముందు నిమ్మరసం తాగితే.. ఏమవుతుంతో తెలుసా.?
Lemon Water
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 30, 2024 | 4:30 PM

ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు జీర్ణ సంబంధిత సమస్యలు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుటుందని నిపుణులు చెబుతుంటారు. అయితే మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల కారణంగా చాలా మందిలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తున్నాయి.

దీంతో ఎన్నో రకాల మందులను ఉపయోగించే పరిస్థితి ఉంది. అయితే ఒక నేచురల్ చిట్కాను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. భోజనానం చేసే 30 నుంచి 40 నిమిషాల ముందు ఒక గ్లాస్‌ లెమన్‌ వాటర్‌ తాగాలని సూచిస్తున్నారు. ఇలా తాగడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారంగా లభిస్తుందని అంటున్నారు. మరి భోజనం చేసే ముందు నిమ్మరసం తాగడం వల్లే కిలేగ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* భోజనానికి ముందు నిమ్మరసం తాగడం వల్ల జీర్ణాశయంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది, ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే, నిమ్మరసం ఆహారం జీర్ణం కావడానికి సహాయపడే జీర్ణ రసాలను ప్రోత్సహిస్తుంది.

* బరువు తగ్గాలనుకునే వారు కూడా భోజనానికి ముందు నిమ్మరసం తాగాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ నీరు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో సహంజంగానే తక్కువ ఆహారం తీసుకుంటాం. ఇది ఒకరకంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అలాగే నిమ్మకాయ నీరు జీవక్రియను పెంచుతుంది, ఇది కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో ఉపయోగపడుతుంది దీంతో సులభంగా బరువు తగ్గొచ్చు.

* లెమన్‌ వాటర్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్న వారికి బాగా ఉపయోగపపడుతుంది. సాధారణంగా ఒత్తిడి కూడా జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.

* ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు భోజనానికి ముందు నిమ్మరసం తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది. శరీరంలోని ఎసిడిటీని బ్యాలెన్స్‌ చేయడలో లెమన్‌ వాటర్‌ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.

* కేవలం కడుపు సంబంధిత సమస్యలు మాత్రమే కాకుండా. చర్మ ఆరోగ్యానని సంక్షించడంలో నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.

* రోగ నిరోధక శక్తికి బలోపేతం చేయడంలో నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఇదులోని విటమిన్‌ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీంతో తరచూ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..