Tulasi water benefits: మీరు ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీళ్లు తాగితే అద్భుత ప్రయోజనాలు..

| Edited By: Ravi Kiran

Jan 26, 2024 | 11:00 AM

మీకు ఎసిడిటీ సమస్య ఉంటే లేదా ఎప్పుడూ కడుపు నొప్పి ఉంటే, మీరు ప్రతిరోజూ ఉదయం తులసి నీటిని త్రాగాలి. అంతేకాదు.. చర్మ సమస్యలను దూరం చేయడానికి కూడా తులసి నీరు మంచిది. ముఖంపై మచ్చలు, మొటిమలను పోగొట్టడంలో తులసి నీరు సహాయపడుతుంది. తులసి నీళ్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Tulasi water benefits: మీరు ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీళ్లు తాగితే అద్భుత ప్రయోజనాలు..
Tulasi Water
Follow us on

తులసికి ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆయుర్వేదంలోనూ గొప్ప స్థానం ఉంది. తులసిని మూలికల రాణి అని పిలుస్తారు. తులసి ఆకులు ఆయుర్వేదంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఉపయోగిస్తారు. తులసిలో విటమిన్‌ ఏ, విటమిన్‌ డి, ఐరన్, ఫైబర్‌, ఆల్సోలిక్‌ యాసిడ్, యూజినాల్ వంటి పోషకాలు ఉన్నాయి. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. తులసి ఆకులను రోజూ నీళ్లలో వేసుకుని తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మారుతున్న వాతావరణంలో చాలా మందికి జలుబు, దగ్గు వంటి సమస్యలు రావచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు తులసి నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులను దూరం చేయడంతోపాటు మిమ్మల్ని పూర్తిగా ఫిట్‌గా ఉంచుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలతో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ వాతావరణంలో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు రోజూ తులసి నీటిని తాగితే, మీ రక్తంలో చక్కెర స్థాయిలు సక్రమంగా ఉంటాయి. చలికాలంలో వేధించే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు కూడా తులసి నీరు ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులను కూడా దూరం చేస్తుంది. ఉదయాన్నే తులసి నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

మీకు ఎసిడిటీ సమస్య ఉంటే లేదా ఎప్పుడూ కడుపు నొప్పి ఉంటే, మీరు ప్రతిరోజూ ఉదయం తులసి నీటిని త్రాగాలి. అంతేకాదు.. చర్మ సమస్యలను దూరం చేయడానికి కూడా తులసి నీరు మంచిది. ముఖంపై మచ్చలు, మొటిమలను పోగొట్టడంలో తులసి నీరు సహాయపడుతుంది. తులసి నీళ్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

తులసి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. తులసిలో ఉండే ఔషద గుణాలు వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరం త్వరగా తగ్గిస్తాయి. తులసి నీరు తాగడం వల్ల మలబద్ధకం, విరేచనాల సమస్యలు కూడా తగ్గుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..