Jaggery Tea : వర్షాకాలంలో బెల్లం టీ తాగితే ఇన్ని లాభాలా ? తప్పక ట్రై చేయండి..

బెల్లం, అల్లం కలిపిన టీ ఆరోగ్యానికి మంచిది. బెల్లం టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే.. జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రతిరోజూ ఒకటి లేదా రెండుసార్లు బెల్లం టీ తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. బెల్లం లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. వర్షాకాలంలో చలిగా అనిపిస్తే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి బెల్లం టీ తాగవచ్చు.

Jaggery Tea : వర్షాకాలంలో బెల్లం టీ తాగితే ఇన్ని లాభాలా ? తప్పక ట్రై చేయండి..
Jaggery Tea

Updated on: Jul 06, 2025 | 4:28 PM

ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. వర్షాలు పడటంతో కొత్త నీరు వచ్చి చేరుతుంది. దీంతో పాటుగా ఈగలు, దోమల బెడదతో సీజనల్‌ వ్యాధులు కూడా విజృంభిస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో చాయ్‌, కాఫీలు, సూప్‌లు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే, కాఫీ, టీ స్థానంలో బెల్లం టీని ట్రై చేయండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. బెల్లం టీని తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరానికి మేలు చేస్తాయి.

బెల్లం, అల్లం కలిపిన టీ ఆరోగ్యానికి మంచిది. బెల్లం టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే.. జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రతిరోజూ ఒకటి లేదా రెండుసార్లు బెల్లం టీ తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. బెల్లం లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి.

వర్షాకాలంలో చలిగా అనిపిస్తే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి బెల్లం టీ తాగవచ్చు. బెల్లం వేడిని ఉత్పత్తి చేస్తుందని, శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందని నమ్ముతారు. బెల్లం టీలో కడుపు సమస్యను తగ్గించే శక్తి ఉంటుంది. దీంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..