Home Remedies: పేలు, ఈపెలు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ వంటింటి చిట్కాతో చెక్ పెట్టండి..

పిల్లల నుంచి పెద్దల వరకూ చాల మంది తలలో పేల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే తలలో పేలు, ఈపులు ఉంటే దురద భరించలేనంతగా ఉంటుంది. ఈ సమస్యని వదిలించుకోవడానికి, చాలా మంది మార్కెట్లో లభించే ప్రత్యేక మైన షాంపూలను ఉపయోగిస్తారు. అయితే కానీ కొన్నిసార్లు ఈ షాంపు కూడా ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు.కనుక పేలు, ఈపులను తొలగించడానికి వంటిన్చి చిట్కాలున్నాయి. ఇవి ప్రభావంటంగా పనిచేస్తాయి.

Home Remedies: పేలు, ఈపెలు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ వంటింటి చిట్కాతో చెక్ పెట్టండి..
Head Lice Home Remedies

Updated on: May 28, 2025 | 6:29 PM

తరచుగా తలలో దురద సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. దీనికి కారణం చుండ్రు లేదా మురికి అనుకుంటారు. అయితే ఒకోక్కసారి తలలో పేలు, ఈపులు ఉన్నా దురద సమస్య మొదలవుతుంది. ఒకరి నుంచి మరొకరికి పేలు కూడా వస్తాయి. దీనికి కారణం పేలు ఉన్న వ్యక్తి పక్కన కుర్చుకోవడం లేదా.. వారు ఉపయోగించిన దువ్వెనను ఉపయోగించినా పేలు ఒకరి నుంచి మరొకరికి వస్తాయి. పేలు తలలో తిరిగుతూ ఇబ్బంది పెట్టడమే కాదు రక్తాన్ని కూడా పీలుస్తాయి. దురదని కలిస్తాయి. కనుక ఈ పేలుని సకాలంలో తగ్గించుకోకపోతే చాలా ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది.

తలలోని పేలు, ఈపెలు దురదను కలిగించడమే కాదు జుట్టు రాలడం, జుట్టు దెబ్బతినడం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. జుట్టు నుంచి పేనులను తొలగించడానికి రెగ్యులర్ షాంపూ లేదా కండిషనర్ ఉపయోగపడదు. అయితే కొన్ని వంటింటి చిట్కాలు ప్రభావంతంగా పనిచేస్తాయి. ఈ రోజు పేలు, ఈపెలు తొలగించే సింపుల్ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం..

తలలో పేలు లేదా ఈపెలు ఉన్నప్పుడు తలలో చాలా దురద ఉంటుంది. జుట్టులో ఏదో కదులుతున్నట్లు లేదా గిలిగింతలు పెడుతున్నట్లు నిరంతరం అనుభూతి చెందుతారు. కొన్నిసార్లు, తలలోని పేలు కారణంగా, మెడ, భుజాలు, తలలో ఎర్రటి దద్దుర్లు, కురుపులు కూడా కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

వేప ఆకులతో
జుట్టులోని పేలు, ఈపెలు తొలగించడానికి వేప ఆకులను ఉపయోగించవచ్చు. వేపాకులను జుట్టుకు 2 విధాలుగా ఉపయోగించవచ్చు. పేనులను తొలగించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఎందుకంటే వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టు సమస్యలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి.

వేప ఆకు నీరు
వేప ఆకులో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల పేలు సమస్యను వదిలించుకోవడానికి వేప ఆకుల నీటిని ఉపయోగించవచ్చు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక పాత్రలో తాజా వేప ఆకులను వేసి.. ఒక కప్పు నీరు వేసి ఈ నీటిని మరిగించండి. నీరు సగానికి తగ్గిన తర్వాత.. ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి జుట్టు కుదుళ్ళ నుంచి జుట్టు పొడవునా స్ప్రే చేయండి. తరువాత జుట్టును తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి.

వేప పేస్ట్ కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది.
పేలు ఈపెలు సమస్యను తొలగించడంలో వేప పేస్ట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం తాజా వేప ఆకులను రుబ్బుకోవాలి. వేపాకులను పేస్ట్ గా చేసి దీనిని జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. ఈ పేస్ట్ ను ఆరనివ్వండి.. తరువాత జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి. వేపలో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ఇవి పేలు, ఈపెల సమస్యను తగ్గిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)