Baldness: అబ్బాయిలూ వింటున్నారా? ఈ తప్పులు చేశారంటే చిన్న వయసులోనే బట్టతల ఖాయం..

|

Feb 14, 2023 | 7:59 PM

అపురూపంగా చూసుకునే జుట్టు అకారణంగా క‌ళ్లముందే రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ఇక చిన్నవయసులోనే బ‌ట్టతల వ‌స్తే మానసికంగా కుంగిపోతుంటారు. సాధారణంగా ఒత్తిడి, పోషకాహార లోపం కారణంగా..

Baldness: అబ్బాయిలూ వింటున్నారా? ఈ తప్పులు చేశారంటే చిన్న వయసులోనే బట్టతల ఖాయం..
Baldness
Follow us on

అపురూపంగా చూసుకునే జుట్టు అకారణంగా క‌ళ్లముందే రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ఇక చిన్నవయసులోనే బ‌ట్టతల వ‌స్తే మానసికంగా కుంగిపోతుంటారు. సాధారణంగా ఒత్తిడి, పోషకాహార లోపం కారణంగా బట్టతల సంభవిస్తుంది. మాన‌వ జన్యువుల్లోని బాల్డ్‌నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కార‌ణంగా బట్టతల వస్తుందని సైన్స్‌ చెబుతోంది. ఓహియో యూనివర్సిటీ డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుసాన్ మాసిక్ ఏం చెబుతున్నారంటే.. సమతుల్య ఆహారం, సమయోచిత మినాక్సిడిల్ జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయని ఆయన అన్నారు. ప్రొటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చని డాక్టర్‌ మాసిక్ తెలిపారు.

అలోపేసియా అరేటా అనే ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల జుట్టు వేగంగా రాలిపోతుంది. ముఖ్యంగా పురుషుల్లో 21 ఏళ్ల లోపు వయసున్న వారిలో 25 శాతం మందికి జుట్టురాలిపోతుంటుంది. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ 70 శాతం మందికి జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వల్ల తలపై జుట్టు వేగంగా ఊడిపోతుంది. ప్రోటీన్లు, ఐరన్ అధికంగా ఉండే గుడ్లు, పాలకూర, మటన్‌, చిక్‌పీస్, గుమ్మడి గింజలు, బ్లాక్ బీన్స్ వంటి ఆహారాలు జుట్టు ఊడటాన్ని నివారించి, ఆరోగ్యకరంగా, దృఢంగా పెరగడానికి సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.