AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: ఈ నూనెతో అద్భుత ప్రయోజనాలు.. జుట్టు సమస్యలు తగ్గించే నూనె ఎలా రెడీ చేయాలంటే..

ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధింత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోవడం. పలుచగా

Hair Care Tips: ఈ నూనెతో అద్భుత ప్రయోజనాలు.. జుట్టు సమస్యలు తగ్గించే నూనె ఎలా రెడీ చేయాలంటే..
Black Pepper Oil
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2022 | 9:55 AM

Share

ప్రస్తుతం చాలా మంది జుట్టు సంబంధింత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోవడం. పలుచగా మారడం.. డాండ్రాఫ్.. కుదుళ్లు బలహీనంగా మారిపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి అనేక రకాల కెమికల్ ప్రొడక్ట్స్.. షాంపూలు..నూనెలు ఉపయోగిస్తారు. అయినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. కానీ ఇంట్లో కొన్ని పదార్థాలు జుట్టు సమస్యలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందులో నల్ల మిరియాలు కూడా. ఇందులో విటమిన్ ఎ, సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటి అనేకమైన పోషకాలు ఉన్నాయి. నల్ల మిరియాల నూనె ఉపయోగిస్తే హెయిర్ ఫోలికల్స్.. స్కాల్ప్ డిటాక్సింగ్.. హెయిర్ పెప్పర్ హెయిర్ ఆయిల్‎ను అప్లై చేయడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. నల్ల మిరియాలను ఎలా ఉపయోగించాలి.. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా.

నల్ల మిరియాల నూనె తయారీ.. మెంతులు.. 2 స్పూన్స్. నల్ల మిరియాలు.. 1 స్పూన్. కరివేపాకు.. 20 నుంచి 25 వరకు. నూనె.. ఆలివ్ లేదా కొబ్బరి

ఎలా చేయాలి..

ముందుగా నల్ల మిరియాలు.. కరివేపాకులను కడాయిలో వేసి వేయించాలి. వాటన్నింటిని లేత గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. అవి చల్లారిన తర్వాత తీసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పాన్ వేడి చేసి అందులో గ్లాసు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి కాగానే.. అందులో మిరియాల పొడి వేసి వేయించాలి. నూనె రంగు మారే వరకు వేయించి.. చల్లార్చి.. ఆ తర్వాత దానిని వడపోసి భద్రపర్చుకోవాలి..

జుట్టు రాలిపోవడం.. బలహీనంగా మారిపోవడం వంటి సమస్యలు ఉంటే.. ఈ నూనెను వారానికి రెండుసార్లు జుట్టుకు పట్టించాలి. కానీ మీ జుట్టు చర్మం జిడ్డుగా ఉంటే.. కనీసం 2 గంటల తర్వాత శుభ్రపరచాలి..గుర్తుంచుకోవాల్సిన విషయం.. ఈ నూనెను రాత్రిళ్లు ఉపయోగించకూడదు..

గమనిక:- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్.. నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. సందేహాల కోసం వైద్యులను సంప్రదించాలి.

Also Read: RRR-Ram Charan: మన మధ్య లేడంటే నమ్మాలని లేదు.. ఇక్కడే ఉన్నారనిపిస్తోంది.. రామ్ చరణ్ 

భావోద్వేగ కామెంట్స్.. 

Samantha: సమంత సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. యశోద షూటింగ్ సెట్స్‏లో..

RRR-Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలంటూ..

Knee Pain: మోకాళ్లు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా ?.. అయితే ఈ ఆకులతో చెక్ పెట్టొచ్చు..