AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care: జుట్టు పట్టుకుచ్చులా పెరగాలా? అయితే మీ ఆహారంలో వీటిని తీసుకోండి..

చాలా మందికి అకారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీని వల్ల మానసికంగా కృంగి పోతుంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతుంటారు. మీలాంటి వారికి శుభవార్త. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా మీ ఆహారంలో ఈ కింద తెల్పిన 7 పదార్ధాలను చేర్చుకుంటే సరి.. మీ జుట్టు చక్కగా పెరుగుతుంది..

Hair Care: జుట్టు పట్టుకుచ్చులా పెరగాలా? అయితే మీ ఆహారంలో వీటిని తీసుకోండి..
Hair Care
Srilakshmi C
|

Updated on: Dec 15, 2024 | 8:21 PM

Share

నేటి కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో జుట్టు రాలడం ఒకటి. దీంతో అధిక డబ్బు ఖర్చు చేసి చాలా మంది హెయిర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఇవి దీర్ఘకాలిక ఉపశమనం కలిగించవు. జుట్టు రాలడం ఆగి, బాగా పెరగాలంటే తినే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలంటున్నారు నిపుణులు. ఈ కింది ఆహారాలు తీసుకుంటే జుట్టు ఆటోమాటిక్‌గా రాలడం ఆగి చక్కగా పెరుగుతుందని సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పాలకూర

పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, సి, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఐరన్ హెయిర్ ఫోలికల్స్‌కు ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

గుడ్లు

గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ప్రొటీన్ జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

చేపలు

సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వెంట్రుకల కుదుళ్లకు పోషణను అందించి, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

గింజలు

శనగలు, బీన్స్‌తో సహా ఇతర గింజలు, విత్తనాల్లో జింక్, ప్రోటీన్, ఫైబర్‌లో పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఈ పప్పులను సూప్‌లు, సలాడ్‌లు, సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు.

నట్స్

నట్స్ తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, జుట్టు పెరుగుదలలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల బాదం లేదా పొద్దుతిరుగుడు గింజలు వంటి నట్స్‌ తీసుకుంటే వీటిల్లోని బయోటిన్, ఇతర B విటమిన్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

చిలగడదుంప

చిలగడదుంపలో విటమిన్ బి, పొటాషియం, విటమిన్ సి, జింక్ వంటి జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఈ చిలగడదుంప జుట్టులో పోషకాల లోపాన్ని పోగొట్టి, వెంట్రుకలను పెంచేలా చేస్తుంది.

క్యారెట్

క్యారెట్‌లో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్‌లోని విటమిన్ ఎ స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇందులోని విటమిన్లు రక్త ప్రసరణను పెంచుతాయి. బయోటిన్, విటమిన్ ఎ కెరాటిన్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?