Healthy Foods For Hair: మీ జట్టు పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలా? అయితే, ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి..

|

Jul 05, 2022 | 9:51 PM

Healthy Foods For Hair: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Healthy Foods For Hair: మీ జట్టు పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలా? అయితే, ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి..
Hair Care Tips
Follow us on

Healthy Foods For Hair: ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు పల్చబడటం, బలహీనమైన జుట్టు, జుట్టు చీలిపోవడం, నిర్జీవమైన జుట్టు, తలపై దురద, చుండ్రు మొదలైన సమస్యలు వేధిస్తుంటాయి. అయితే, జుట్టు సమస్యలను ఎదుర్కోవటానికి మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ సూచనల ప్రకారం డైట్‌లో ఏయే ఆహారాలను చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్ బి-కాంప్లెక్స్: జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ బి-కాంప్లెక్స్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తృణధాన్యాలు, పప్పులు, గింజలు, మాంసం, కొన్ని ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ఆహారాలు జుట్టుకు లోతైన పోషణను అందిస్తాయి. జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా మార్చుతాయి.

బయోటిన్: ఈ విటమిన్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కోడిగుడ్డు పచ్చసొన, పాలు, వేరుశెనగ, బాదం, సోయాబీన్స్, పెరుగు, చిలగడదుంపలు మొదలైన బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇది శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్ ఎ: విటమిన్ ఎ శిరోజాలను ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఇది తలకు మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈ విటమిన్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే అనేక రకాల ఆహారాలను కూడా తీసుకోవచ్చు. క్యారెట్, బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆహారాలను ఆహారంలో తీసుకోవాలి.

విటమిన్ సి: విటమిన్ సి జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జుట్టు నెరవడం, జుట్టు రాలడం, చుండ్రును నివారిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే అనేక రకాల ఆహారాలను తీసుకోవాలి. సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, కివి, కాంటాలౌప్, పైనాపిల్, టొమాటో, క్యాప్సికమ్, ముదురు ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవాలి.