AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటీస్‌ రోగులకు దివ్వ ఔషదం.. ఈ ఆకును మరిగించి తాగితే హాస్పిటల్‌కు వెళ్లే పనే ఉండదు!

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.వాటిలో డయాబెటీస్ కూడా ఒకటి. ఒకప్పుడు కేవలం వయస్సు మల్లిన వారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు యువకులను కూడా వదలట్లేదు. ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి జనాలు మార్కెట్‌లొ లభించే అనే మందులు వాడినా కొన్ని సార్లు పూర్తి పరిష్కారం లభించకపోవచ్చు. అయితే మన పెరట్లో ఉండే ఒక్క చెట్టు ఆకుతో ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచొచ్చనే విషయం మీకు తెలుసా? అవును జమా ఆకుతో మనం షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

డయాబెటీస్‌ రోగులకు దివ్వ ఔషదం.. ఈ ఆకును మరిగించి తాగితే హాస్పిటల్‌కు వెళ్లే పనే ఉండదు!
Benefits Of Guava Leaves For Diabetes
Anand T
|

Updated on: Sep 01, 2026 | 7:41 PM

Share

శారీరక శ్రమ లేకపోవడం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా షుగర్ బారీన ఎక్కవ మంది పడుతున్నారు. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి జనాలు తరచుగా ఖరీదైన ప్రిస్క్రిప్షన్ మందులు వాడుతారు. కానీ వీటిని దీర్ఘకాలం పాటు వాడితే దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి జామ ఆకుతో దీన్ని సహజంగా మనం కంట్రోల్ చేయవచ్చని ఆయుర్వేదన నిపుణులు చెబుతున్నారు. అవును జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, ఇన్సులిన్ స్థాయిలను సహజంగా సమతుల్యం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

జామ ఆకుల ప్రయోజనాలు

బ్లడ్ షుగర్ కంట్రోల్: జామ ఆకులలో సహజ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. తద్వారా డయాబెటీస్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది.

మెరుగైన జీర్ణక్రియ: జామ ఆకుల్లో డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి చక్కెర శోషణను నెమ్మదింపజేస్తాయి.

రోగనిరోధక శక్తి పెంపు: జామ ఆకులలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తి పెంచి శరీరానికి శక్తిని అందిస్తుంది. దీని వల్ల డయాబెటిస్ వల్ల వచ్చే ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి బలోపేతం వల్ల సీజనల్ వ్యాధుల భారీ నుంచి కూడా రక్షణ ఉంటుంది.

జామ ఆకులను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి

మీరు జామ ఆకులను నేరుగా కూడా తినవచ్చు. అవును మీ ఇంటి పెరట్లో ఉన్న చెట్టు నుంచి రోజూ ఉదయం పరగడుపున 2 నుంచి 3 లేత జామ ఆకులను తెంచుకొని వాటిని శుభ్రంగా కడిగి నమిలి తినవచ్చు. అలా నచ్చకపోతే జామ ఆకులతో టీ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని శుభ్రమైన జామ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడకట్టి హెర్బల్ టీలాగా తాగవచ్చు.

గమనిక: అయితే ఇది సహజంగా డయాబెటీస్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి ఉత్తమైనదే అయినప్పటికీ.. పూర్తిగా డయాబెటీస్‌ను తగ్గించలేదు. కాబట్టి వైద్యుల సలహా మేరకు ఇతర మందులను కూడా వాడడం ముఖ్యం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us