చలికాలంలో పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి. అలాగే పచ్చి ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం..
చలికాలంలో చాలా మందికి ఎముకలు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి. కీళ్ళ వాపు, నొప్పులతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎముకలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడే అనేక పోషకాలు పచ్చి ఉల్లిపాయలో ఉన్నాయి. విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మొదలైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పి నివారిణిగా పనిచేస్తాయి.
పచ్చి ఉల్లిపాయలో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉల్లిపాయ జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఉల్లి రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఉల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పచ్చి ఉల్లిపాయల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గుతో పోరాడడంలో సహాయపడతాయి. విటమిన్ సి శరీర ఇన్ఫెక్షన్లు, వైరస్లతో పోరాడటానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారించి, ఫైటోకెమికల్స్ వైరస్, బ్యాక్టీరియాలను చంపుతాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.