Glowing Skin: అబ్బా.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అందాన్ని హైస్పీడ్‌లో పెంచే సూపర్ చిట్కా.. ఇంట్లోనే
అందంగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం చాలా మంది రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతారు. కానీ ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతోనే ఈజీగా మనం అందాన్ని పెంచుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును.. ఆరోగ్య నిపుణులు ప్రకారం. అన్నం వండుకున్న తర్వాత మిగిలిన గెంజితో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా చర్మం మెరవడమే కాకుండా సాగడం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

మన చర్మ ఆరోగ్యానికి అన్నం వండిన తర్వాత గెంజిలో ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఇనోసిటాల్, ఎలాంటోయిన్ వంటి రసాయన సమ్మేళనాలు ఉంటాయని..ఇవి చర్మం లోపల పొరలో ఉండే కొలాజెన్ మెష్ ను ఆరోగ్యంగా ఉంచి, అది పిగిలిపోకుండా, తెగిపోకుండా చూస్తుందని చెబుతున్నారు. ఇది చర్మానికి దృఢత్వాన్ని, స్థితిస్థాపకతను అందిస్తుందని.. ఎలాంటోయిన్ చర్మం రంగును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ రెండు సమ్మేళనాల వల్ల గెంజి చర్మ సౌందర్యానికి అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుందని నిపుణులు అంటున్నారు.
మర్దనతో రక్త ప్రసరణ మెరుగుదల
శరీరంలోని అన్ని భాగాల కన్నా చర్మానికి రక్త ప్రసరణ తక్కువగా ఉంటుందని.. ఈ క్రమంలో మసాజ్ చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ రెండింతలు, మూడింతలు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే వ్యర్థాలు, విష పదార్థాలు రక్తం ద్వారా బయటకు వెళ్ళిపోతాయని తెలిపారు. ఈ ప్రక్రియ సూక్ష్మ రక్తనాళాలను తెరుచుకునేలా చేసి, చర్మ కణాలకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తుందని.. చర్మం డ్రైనెస్ బారిన పడకుండా హైడ్రేటెడ్‌గా ఉంచుతుందని తెలిపారు.
ఒత్తిడి తగ్గింపు,మానసిక ప్రశాంతత
మసాజ్ చేయడం వల్ల రస్తప్రసరణతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుందని.. మసాజ్ చేసేప్పుడు రిలీజ్ అయ్యే.. కార్టిజాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయని.. ఇది వేగస్ నెర్వ్‌ను ఉత్తేజపరిచి, నాడీ వ్యవస్థ ద్వారా పూర్తి విశ్రాంతిని కలిగిస్తుందని చెబుతున్నారు. మసాజ్ చేసేటప్పుడు కలిగే హాయి, ప్రశాంతత నిద్ర కూడా త్వరగా పడుతుందని చెబుతున్నారు.పూర్వ కాలం నుండి వాడుకలో ఉన్న ఈ పద్ధతి ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యతను తెచ్చుకుంటుంది. ఈ శాస్త్రీయ వాస్తవాలను తెలుసుకుని, మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి లబ్ధి పొందవచ్చు.
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
