లవంగాల గురించి మీకు  తెలియని నిజాలు..  ఇవి తెలిస్తే అవాక్కే..

17July 2026

Krishna

లవంగాల్లో ఉండే సహజ సమ్మేళనాలు శరీరంలో జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవడమే కాకుండా గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

జీర్ణక్రియ మెరుగు

లవంగాలు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. వీటితో చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గి, కఫం త్వరగా బయటకు పోతుంది. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడతాయి.

గొంతు నొప్పికి చెక్

దంత సమస్యలకు లవంగం ఒక దివ్యౌషధం. దీనిలో ఉండే యూజినాల్ అనే పదార్థానికి నొప్పిని మరియు వాపును తగ్గించే గుణం ఉంది. పంటి నొప్పితో బాధపడేవారు లవంగ నూనెను వాడటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.

పంటి నొప్పికి చెక్

లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారించి, వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా టీ లేదా కషాయం రూపంలో తీసుకోవచ్చు.

రోగనిరోధక శక్తి

లవంగాలను అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీ, కడుపులో చికాకు వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని పరిమితంగా తీసుకోవాలి.

ఎసిడిటీ సమస్యలు

లవంగాల్లోని యూజినాల్ శరీరంలో రక్తాన్ని పలచబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఇప్పటికే రక్తం పలచబడటానికి మందులు వాడుతున్న వారు లేదా సర్జరీ చేయించుకోబోయే వారు లవంగాలను అధికంగా తీసుకోకూడదు.

రక్తం పలచన

 కొంతమంది శరీర తత్వానికి లవంగాలు పడవు. వీటిని ఎక్కువగా వాడటం వల్ల చర్మంపై దురదలు, ఎరుపు రంగు దద్దుర్లు రావడం లేదా కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి.

అలర్జీల ముప్పు

చిన్న పిల్లల విషయంలో లవంగాలు లేదా లవంగ నూనెను నేరుగా ఉపయోగించడం అస్సలు మంచిది కాదు. ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి పిల్లలకు ఇచ్చే ముందు వైద్యుల సలహా తప్పనిసరి.

చిన్న పిల్లలకు..