Ghee in Navel: నాభిపై నెయ్యితో మసాజ్.. అమ్మమ్మ కాలం నాటి ఈ చిట్కాతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

|

Dec 27, 2024 | 10:07 AM

ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ వంటి పెద్దలుంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎటువంటి చిన్న చిన్న వ్యాధులు వచ్చినా సింపుల్ టిప్స్ ని చెబుతారు. వాటి ద్వారా మెడిసిన్ ఉపయోగించకుండానే తగ్గించేలా చేస్తారు. అలాంటి టిప్స్ లో ఒకటి నాభిపై నెయ్యిని అప్లై చేయడం. నెయ్యితో నాభిని మసాజ్ చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి అని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు.

Ghee in Navel: నాభిపై నెయ్యితో మసాజ్.. అమ్మమ్మ కాలం నాటి ఈ చిట్కాతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Ghee In Navel
Follow us on

శరీరంలో ఉండే నాభిని బొడ్డు అని కూడా అంటారు. ఈ నాభి శరీరక ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెబుతుంది. శక్తివంతమైన అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేదంలో నాభి శక్తికి కేంద్రంగా పరిగణించబడుతుంది. నాభి ఆరోగ్యం, తేజాన్ని, ఆధ్యాత్మిక సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. నాభిపై నెయ్యి పూయడం అనేది పురాతన నుంచి వస్తున్న సంప్రదాయం. ఆయుర్వేదం ప్రకారం.. నాభిపై నెయ్యి అప్లై చేయడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

నెయ్యి లేదా నూనెతో నాభిని సున్నితంగా మసాజ్ చేస్తే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు చర్మం మెరుస్తూ, మృదువుగా మారుతుంది. ఆయుర్వేదం ప్రకారం నాభిపై నెయ్యి పూయడం వల్ల వాత దోషం సమతుల్యం అవుతుంది. వాత అసమతుల్యతతో ఉంటే ఆందోళన, అలసట వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నేపధ్యంలో ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా చెప్పినస్నానం చేసే ముందు నాభిలో నెయ్యి రాసుకోవడం వల్ల కలిగే 4 ప్రయోజనల గురించి తెలుసుకుందాం..

డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ నాభిలో నెయ్యి వేసుకుని నాభి ప్రాంతం చుట్టూ రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని.. స్నానం చేసే ముందు ఇలా చేయడం వలన స్నానం చేయడం వలన శరీరంపై ఉన్న నెయ్యి జిడ్డు తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యంగా జీర్ణక్రియ: స్నానానికి ముందు నెయ్యితో నాభిని మర్దన చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నెయ్యి జీర్ణవ్యవస్థను పెంచేలా ప్రేరేపిస్తుంది. అంతేకాదు సున్నితమైన మసాజ్ కడుపులోని నరాలను సక్రియం చేస్తుంది. ఇది మల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉబ్బరం తగ్గిస్తుంది. పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచడంలో: నాభిపై నెయ్యి అప్లై చేయడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరానికి పోషణనిస్తాయి. నాభిపై నెయ్యి మర్దన చేయడం వల్ల శరీర రక్షణ వ్యవస్థ బలపడుతుంది. ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నిద్ర లేమి నుంచి ఉపశమనం: నాభిపై నెయ్యితో మసాజ్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. గోరువెచ్చని నెయ్యి నాడీ వ్యవస్థకు విశ్రాంతినిస్తుంది. మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. నెయ్యితో నాభిని మసాజ్ చేయడం వల్ల నిద్ర విధానాన్ని నియంత్రిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

జుట్టు పెరుగుల: నాభి దగ్గర నెయ్యి మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుతుంది. నెయ్యిలో ఉండే పోషక గుణాలు శరీరంలో శోషించబడతాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. నాభిపై నెయ్యి రాసుకోవడం వల్ల వెంట్రుకల మూలాలు బలపడి చుండ్రు తగ్గుతుంది. జుట్టు పట్టులా మెరుస్తుంది.

 

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..