పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురై నీరసం సమస్య వస్తుంది. అయితే దీని నుంచి రక్షణకు దానిమ్మ రసం తాగితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దానిమ్మ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వచ్చే నీరసం సమస్యను దూరం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దానిమ్మలో ఐరన్ సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసంలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, మెగ్నీషియం వంటి విటమిన్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో నరాల బలహీనత వల్ల తరచూ నీరసం వస్తుంది. కాబట్టి దానిమ్మ రసం తాగడం వల్ల దానిమ్మలో కొన్ని యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ కారణంగా నరాలు కండరాలకు సమర్థవంతంగా పని చేస్తాయి. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఓ సారి తెలుసుకుందాం.
దానిమ్మపండులో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అవి మంట, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. అలాగే మీ నరాలకు బలాన్ని ఇస్తాయి. ఇందులోని మెగ్నీషియం నరాలు, కండరాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
దానిమ్మ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి కండరాల బలాన్ని పెంచుతుంది. ఇది కాకుండా, ఇనుము శరీరంలో రక్తహీనతను తొలగిస్తుంది. అలాగే కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి దానిమ్మ కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
కనీసం రోజుకు ఒక్కసారైనా దానిమ్మ రసం తాగితే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజా దానిమ్మ నుంచి రసం తీసి తాగడానికి ప్రయత్నించాలి. ఇది కండరాలు, నరాలకు మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా అనేక ఇతర మార్గాల్లో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం