Foods To Control Hunger Pangs: కొంతమందికి తరచూ ఆహారం తిన్న వెంటనే ఆకలిగా అనిపిస్తుంటుంది. తిన్న వెంటనే ఆకలిగా అనిపించడాన్ని హంగర్ పెగ్స్ అంటారు. తరచుగా ఆకలితో ఉండటం అంటే.. తగినంత ఆహారం తీసుకోవడం లేదని అర్థం. అటువంటి పరిస్థితిలో ఇది.. ఆరోగ్యంపై, ఏకగ్రతపై చెడుగా ప్రభావితం చూపుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని పదార్థాలను తీసుకుంటే ఆకలిని నియంత్రించడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు ఆహార నిపుణులు.. ఆరోగ్యంగా ఉండేందుకు, ఆహారం తిన్న తర్వాత ఆకలి తీర్చుకునేందుకు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తిన్న తర్వాత ఆకలిగా ఉంటే.. వీటిని తినండి..
బాదంపప్పు: తరచుగా ఆకలి సమస్య నుండి బయటపడాలంటే బాదంపప్పును తీసుకోవాలి. ఎందుకంటే బాదంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతాయి. దీని కారణంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది.
కొబ్బరి: కొబ్బరి ఒక అద్భుతమైన చిరుతిండి.. కొబ్బరిని తీసుకోవడం ద్వారా తరచుగా ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. దీనితో పాటు ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కొబ్బరిలో రాగి, ఇనుము, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. దీని వల్ల మీకు పదే పదే ఆకలిగా అనిపించదు.
మజ్జిగ: మజ్జిగ ఒక ప్రొటీన్ రిచ్ డ్రింక్. మజ్జిగ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. మరోవైపు ఆహారం తిన్న తర్వాత మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తే మజ్జిగ తీసుకోవాలి.
మొలకలు: మొలకలలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల పదే పదే ఆకలిగా అనిపిస్తే, మీరు మొలకలను తినడం మంచిది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి