Summer Health: వేసవి కాలపు ఎండల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలేకాక జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి బయట పడడానికి ఉల్లిపాయ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. నిజానికి ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అంటుంటారు పెద్దలు. ఇక ఉల్లిపాయ వేసవి కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్‌ను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా బ్యూటీ కేర్ రొటీన్, జుట్టు సంరక్షణలోనూ ఉపయోగిస్తుంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే..ఉల్లిపాయతోనే కాదు, మొలకెత్తిన ఉల్లిపాయలు కూడా ఎన్నో విధాలుగా ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. సాధారణంగా పెద్దమొత్తంలో ఉల్లిపాయలను కొని వంటగదిలో చాలా రోజులు ఉంచితే మొలకలు వస్తాయి. అయితే ఎక్కువ మంది ప్రజలు మొలకెత్తిన ఉల్లిపాయలను పక్కనపెట్టేస్తారు. కానీ వీటిని ఉపయోగించడం ఎంత ప్రయోజనకరమో.. మరి ఆ ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..