World Heart Day 2021: ఆరోగ్యమైన గుండె కోసం 5 పండ్లు..! వైద్యుడి అవసరమే ఉండదు.. తెలుసుకోండి..

World Heart Day 2021: ఆధునిక జీవితంలో మనుషులను ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా

World Heart Day 2021: ఆరోగ్యమైన గుండె కోసం 5 పండ్లు..! వైద్యుడి అవసరమే ఉండదు.. తెలుసుకోండి..
World Heart Day

Updated on: Sep 28, 2021 | 9:30 PM

World Heart Day 2021: ఆధునిక జీవితంలో మనుషులను ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులు. ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనా. గుండె జబ్బులకు ప్రధాన కారణం మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు. గుండె జబ్బులు కేవలం వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా అధికమయ్యాయని పేర్కొంటున్నారు. అయితే గుండె ఆరోగ్యం కోసం ఈ 5 పండ్లను డైట్‌లో చేర్చితే వైద్యుడి వద్దకు వెళ్లనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. పుచ్చకాయ
పుచ్చకాయ మన గుండెకు మేలు చేసే పండు. ఒక అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయ హానికరమైన కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. LDL కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. శరీరంలో ఇది ఎక్కువగా పెరిగితే గుండెపోటుకు దారితీస్తుంది.

2. ఆరెంజ్‌
ఆరెంజ్ కొంచెం పుల్లగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సిట్రస్ పండ్లలో చాలా పోషకాలు ఉంటాయి. అవి పొటాషియంతో నిండి ఉంటాయి. గుండె బాగా పనిచేయడానికి తోడ్పడుతాయి. ఊబకాయం, గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి.

3. బ్లూబెర్రీలు
బ్లూ బెర్రీలు, బ్లాక్‌ బెర్రీలు, స్ట్రా బెర్రీలు అన్నిరకాల బెర్రీ పండ్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి అధికంగా తీసుకోవడం గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. ద్రాక్షపండు
ద్రాక్షలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. గుండె జబ్బులను నివారించడానికి ఈ పండు అధికంగా తోడ్పడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. 2.5 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

5. నేరేడు పండు
నేరేడు పండ్లలో విటమిన్లు A, C, E, K, అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి చాలా మంచివి. కర్జూర, వాల్‌నట్స్, బాదంలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయి. ఇందులో మెగ్నీషియం, రాగి, మాంగనీస్, గుండెకు ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి.

Skin Care: జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా..! అయితే ఈ 3 ఫేస్‌వాష్‌లు చక్కటి పరిష్కారం..

MI Vs PBKS, IPL 2021: విఫలమైన పంజాబ్ బ్యాట్స్‌మెన్స్.. ముంబయి టీం టార్గెట్ 136

Viral Video: ఫ్రెండ్‌నే కిడ్నాప్‌ చేసి 2 కోట్లు డిమాండ్‌.. పోలీసుల ఎంట్రీతో సీన్‌ రివర్స్‌.. వీడియో