లక్ష్మణఫలం.. ఇలాంటి ఎన్నో రోగాలను నయం చేసే రామబాణం..!

బాగా అలసిపోయినవారు లక్ష్మణ ఫలం తింటే వెంటనే శక్తిని పుంజుకుంటారు. ఈ పండులో బి విటమిన్లు ఉంటాయి. ఇవి శక్తి ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో యాక్టివ్‌గా మారుతారు. లక్ష్మణ ఫలంలో కాల్షియం, ఫాస్ఫరస్‌ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. దీంతో ఆస్టియోపోరోసిస్‌ సమస్య నుంచి ఉపశమనం.. నొప్పులు తగ్గుతాయి.

లక్ష్మణఫలం.. ఇలాంటి ఎన్నో రోగాలను నయం చేసే రామబాణం..!
Lakshman Fruit

Updated on: Jun 15, 2025 | 9:12 PM

సీతాఫలం, రామాఫలం లాగే లక్ష్మణ ఫలం కూడా ఉంటుంది. దీనిని ఇంగ్లీష్‌లో ఆనోనా మ్యూరికాటా అని అంటారు. లక్ష్మణ ఫలంలో 12 రకాల క్యాన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పలువురు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. లక్ష్మణఫల చెట్టు బెరడు, ఆకులు, విత్తనాలను ఆయుర్వేద వైద్య తయారీలో వాడుతున్నారు. ఈ పండు తరచూ తినటం వల్ల కడుపులో పురుగులను హరిస్తుంది. విష జ్వరాలను తగ్గించుటకు లక్ష్మణ ఫలాలు బాగా ఉపయోగపడతాయి.

లక్ష్మణ ఫలం ఆకులతో తలలో పేలను నివారించేందుకు కూడా ఉపయోగిస్తారు. ఇందుకోస లక్షణ ఫలం ఆకులను ముద్దగా చేసి తలకు పట్టించుకుని బాగా మర్దన చేసుకోవడం జరుగుతోంది. పార్శ్వపు నొప్పి, మధుమేహం, మూత్రకోశ వ్యాధుల చికిత్సలో కూడా లక్ష్మణఫలాన్ని వాడుతున్నారు. బాలింతల్లో పాలు వృద్ధి చెందడానికి కూడా లక్ష్మణఫలం తగిన ఫలితాన్ని ఇస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ పండ్ల గింజలను పొడిచేసి నీళ్ళలో కలిపి రాసుకుంటే కండరాల నొప్పులు తగ్గుతాయని వినికిడి. విటమిన్ సి, విటమిన్ బీ1, విటమిన్ బీ2 పుష్కలంగా ఈ ఫలాల్లో లభిస్తుందని పలువురి వైద్యుల అభిప్రాయం.

ఇంకా.. ఈ పండులో విటమిన్ సీ, విటమిన్ బీ1, విటమిన్ బీ2.. పుష్కలంగా లభిస్తాయట. కండరాల నొప్పి తగ్గడానికి, బాలింతల్లో పాల వృద్ధికి, పార్శపు నొప్పి, షుగర్, మూత్రకోశ వ్యాధుల చికిత్సలోనూ లక్ష్మణఫలాన్ని ఉపయోగిస్తారట. విటమిన్ సి, విటమిన్ బీ1, విటమిన్ బీ2 పుష్కలంగా ఈ ఫలాల్లో లభిస్తుందని పలువురి వైద్యుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..