Guava: జామకాయతో నిండు యవ్వనం..! ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

|

Dec 11, 2021 | 9:38 PM

Guava Benfits: శీతాకాలం లభించే పండ్లలో జామకాయ ఒకటి. ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరు జామకాయ తినాలి. ఇందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.

Guava: జామకాయతో నిండు యవ్వనం..! ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Guava
Follow us on

Guava Benfits: శీతాకాలం లభించే పండ్లలో జామకాయ ఒకటి. ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరు జామకాయ తినాలి. ఇందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. జామకాయలే కాకుండా ఆకులు కూడా దివ్య ఔషధంలో పనిచేస్తాయి. జామపండులో విటమిన్ సి, లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచేలా చేస్తుంది. ముడతలు పడిన చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది.

ఇందులో నీటిశాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం ఎక్స్‌ పోలియేట్‌ కాకుండా కాపాడుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది. జామ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జామకాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో జామపండు సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి జామ ఒక దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో బరువును నియంత్రించడంలో జామకాయ సహయపడుతుంది. అలాగే పండును తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కానీ సీజన్ మారినప్పుడు రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. జామలో ఉండే అనేక యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి. జామ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. శక్తిని కూడా ఇస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇతర పండ్ల కంటే ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. జామ గింజలు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

ప్రపంచంలో ఒంటరి ఇల్లు.. 100 ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది.. కారణమేంటో తెలుసా..?

ప్రయాణికుల కోసం అక్కడి రైల్వే స్టేషన్‌లో ఆ సేవలు ప్రారంభం.. సమయం ఆదా.. ఛార్జీలు తక్కువే..

డిజిటల్‌ చెల్లింపులకు UPI బెస్టా NEFT బెస్టా.. రెండిటి మధ్య తేడాలేంటి..?