Boiled Egg in Winter: శీతాకాలంలో గుడ్డు వెరిగుడ్డు.. ఉడికించిన గుడ్లు ఎందుకు తినాలో తెలుసా?

Boiled Egg in Winter Season: గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అని అంటారు. అందులో ఉండే ప్రోటీన్స్ శరీరానికి ఎన్నో పోషకాలను అందించి.. ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే గుడ్డును పోషకాహారానికి

Boiled Egg in Winter: శీతాకాలంలో గుడ్డు వెరిగుడ్డు.. ఉడికించిన గుడ్లు ఎందుకు తినాలో తెలుసా?
Boiled Egg

Updated on: Oct 30, 2021 | 1:59 PM

Boiled Egg in Winter Season: గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్ అని అంటారు. అందులో ఉండే ప్రోటీన్స్ శరీరానికి ఎన్నో పోషకాలను అందించి.. ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే గుడ్డును పోషకాహారానికి కేంద్రబిందువుగా పేర్కొంటారు. ప్రతీ రోజూ ఒక గుడ్డును ఆహారంగా తప్పనసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. గుడ్ల వల్ల ప్రయోజనం ఏమిటంటే.. వాటిని ఉడికించైనా.. ఆమ్లెట్‌గానైనా, ఇంకా పలు రకాలుగా తయారు చేసుకొని ఇష్టంగా ఆరగించవచ్చు. అయితే వీటన్నింటికన్నా.. కేవలం ఉడికించిన గుడ్లతోనే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉడికించిన గుడ్లల్లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుందని.. ఇది శరీర బరువును పెంచదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గుడ్డు పచ్చసొనలో ఉండే విటమిన్ డి జలుబు, ఫ్లూని నివారిస్తుంది. దీంతోపాటు ఉడికించిన గుడ్డు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా చర్మం, కళ్ళు, జుట్టుకు కూడా మేలు చేస్తుంది.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉడికించిన గుడ్డు తీసుకోవడం వల్ల 77 కేలరీల శక్తి అందుతుంది. ఇందులో 0.6 గ్రాముల కార్బోహైడ్రేట్, 1.6 గ్రాముల స్యాచ్యురేటెడ్ ఫ్యాట్, 5.3 గ్రాముల కొవ్వు, 2 గ్రాముల మోనోశాచురేటెడ్ ఫ్యాట్, 6.3 గ్రాముల ప్రోటీన్, 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, 6 శాతం విటమిన్ ఎ, 9 శాతం విటమిన్ B12, 15 శాతం విటమిన్ B2, 7 శాతం విటమిన్ B5, 22 శాతం సెలీనియం, 86 ఎంజీ ఫాస్పరస్ ఉన్నాయి. అయితే.. శీతాకాలంలో వేడిని నిర్వహించడానికి.. శరీరానికి అదనపు శక్తి అవసరం. కావున ఈ సీజన్‌లో ముఖ్యంగా గుడ్లను ఆహారంగా తీసుకోడం చాలా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. చలికాలంలో గుడ్లను ఏదో ఒక రూపంలో తినడం ముఖ్యమని, తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శీతాకాలంలో గుడ్లను ఎందుకు తినాలంటే..?
కంటి, మెదడు ఆరోగ్యం:
గుడ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు, కంటి ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తాయి. గుడ్డులోని కోలిన్ అనే రసాయనం జ్ఞాపకశక్తిని, నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. మంచి కంటి చూపుకు విటమిన్ ఎ చాలా ముఖ్యం.

ప్రోటీన్ సప్లిమెంట్‌గా పనిచేస్తుంది:
ఒక గుడ్డులో 6 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడకుండా ఉంటుంది. మీ శరీర కణాల పనితీరును మెరుగుపర్చేందుకు ప్రోటీన్లు చాలా అవసరం.

ఐరన్ లోపాన్ని తొలగిస్తుంది:
గుడ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్ల వల్ల శరీరం అలసట గణనీయంగా తగ్గుతుంది. ప్రోటీన్ లోపం ఏర్పడకుండా ఉండేందుకు గుడ్డు పచ్చసొన తీసుకోడం మంచింది.

ఇమ్యూనిటీ బూస్టర్:
రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. కోడిగుడ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు రోగనిరోధక శక్తిని ప్రభావవంతంగా పెంచుతాయి. దీనిలో ఉండే అనేక పోషకాలు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

Also Read:

Crime News: కూతురుపై కన్నేసిన ప్రియుడు.. తట్టుకోలేక ఆ మహిళ వేసిన శిక్షేంటో తెలుసా..?

Crime News: భర్తకు వీడియో కాల్ చేసి భార్య అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లడం లేదని ఏం చేసిందంటే..?

Dinosaur Speech: ఇప్పటికైనా మారండి.. లేకపోతే మాలాగే అంతరించిపోతారు.. యూఎన్ సదస్సులో డైనోసార్ ఉద్భోద.. Viral Video