తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ కరోనా కాలంలో సీజనల్ వ్యాధులు కూడా జనాలను భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ సీజన్లో ఆరోగ్యం పై మరింత శ్రద్ద అవసరం. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. జలుబు, ఫ్లూ, జ్వరం, ఫంగస్, టైఫాయిడ్, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో తీసుకోవాల్సిన ఆహారం పై మరింత శ్రద్ధ పెట్టాలి. ఈ కాలంలో ఎక్కువగా నీటితో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వలన అనారోగ్య సమస్యలు వేదిస్తుంటాయి. అందుకే ఈ సీజన్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి… ఏ ఆహారం తీసుకోకూడదో తెలుసుకుందామా.
ఈ సీజన్లో ఆరోగ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ఫ్రెష్ సూప్, కధ, హెర్బల్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయాల తీసుకోవడం మంచిది. అలాగే ఈ సీజన్లో లభించే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. అంటే సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ, గుమ్మడికాయ వంటి కూరగాయలను తీసుకోవాలి. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మూలికలు, మిరియాలు, తులసి, పుదీనా, వేప, మసాలా దినుసుల వినియోగం పెంచాలి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఫ్లూ వ్యాధి రాకుండా చేస్తాయి.
ఏవి తినకూడదు..
ఈ కాలంలో తేమ పెరగడం, ఉష్ణోగ్రత కారణంగా.. ఆకు కూరలపై ఫంగస్ పెరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే వర్షాకాలంలో ఆకు కూరలకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ ఆకుకూరలు తినాలనుకుంటే వాటిని ఎక్కువగా శుభ్రం చేయాలి. ఈ కాలంలో జీర్ణశయాంతర ప్రేగు వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వేయించిన ఫుడ్.. నూనె కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి. అలాగే కాలంలో చేపలు అసలు తీనకూడదు.
Actress Pragathi: పాపం ఎంత కష్టమొచ్చింది.. ట్రెడ్మిల్ పై నటి ప్రగతి వర్కవుట్స్ మాములుగా లేవుగా..