నాన్ వెజ్ స్పెషల్.. వెడ్డింగ్ స్టైల్ క్రంచీ చికెన్ లెగ్ ఫ్రై రెసిపీ మీకోసం..!

చికెన్ అంటేనే ప్రోటీన్ కింగ్. తక్కువ కొవ్వుతో, బోలెడు అమైనో ఆసిడ్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండిన చికెన్.. మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. బిర్యానీ, చికెన్ 65, పెప్పర్ చికెన్ లాంటివి ఆల్రెడీ సూపర్ ఫేమస్. కానీ వెడ్డింగ్ స్టైల్ క్రంచీ చికెన్ లెగ్ ఫ్రై టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు అదే టేస్ట్, అదే క్రంచ్ స్టైల్ తో మీ ఇంట్లోనూ ఈజీగా చేయొచ్చు.

నాన్ వెజ్ స్పెషల్.. వెడ్డింగ్ స్టైల్ క్రంచీ చికెన్ లెగ్ ఫ్రై రెసిపీ మీకోసం..!
Chicken Leg Pieces Receipe

Updated on: Jul 17, 2025 | 8:44 PM

చికెన్ అంటేనే ప్రోటీన్ పవర్ హౌస్.. కొవ్వు తక్కువ, బాడీకి కావాల్సిన అమైనో యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. చికెన్‌ తో చేసే వంటకాల్లో బిర్యానీ, చికెన్ 65, పెప్పర్ చికెన్ లాంటివి చాలా ఫేమస్. కానీ ఈ పెళ్లి విందుల స్టైల్ క్రంచీ చికెన్ లెగ్ ఫ్రై మాత్రం మామూలుగా ఉండదు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • చికెన్ లెగ్ పీసులు – 20
  • వెల్లుల్లి పేస్ట్ – 100 గ్రాములు
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 50 గ్రాములు
  • చిల్లీ చికెన్ మసాలా పొడి – 25 గ్రాములు
  • కార్న్ ఫ్లోర్ – 100 గ్రాములు
  • బియ్యం పిండి – 25 గ్రాములు
  • ఉప్పు – 20 గ్రాములు
  • నిమ్మరసం – 2 నిమ్మకాయలది
  • గుడ్లు – 2
  • ఆయిల్ – వేయించడానికి సరిపడా
  • కరివేపాకు – కొద్దిగా (ఆప్షనల్)

తయారీ విధానం

ముందుగా చికెన్ లెగ్ పీసులను బియ్యం కడిగిన నీళ్లలో 20 నిమిషాలు నానబెట్టండి. ఈ సింపుల్ ట్రిక్ చికెన్‌ ను చాలా మృదువుగా, రుచిగా మారడానికి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ చికెన్ మసాలా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, ఉప్పు, నిమ్మరసం, రెండు గుడ్లు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మసాలా మిశ్రమం తయారయ్యాక నానబెట్టిన చికెన్ పీసులను ఇందులో వేసి.. మసాలా అంతా చికెన్‌ కు పర్ఫెక్ట్‌ గా పట్టేలా బాగా కలపండి. ఇలా కలిపిన చికెన్‌ ను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి.

ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసి బాగా వేడి చేయండి. నూనె పర్ఫెక్ట్‌ గా వేడయ్యాక.. మసాలా పట్టించిన చికెన్ పీసులను నెమ్మదిగా నూనెలో వేయండి. సుమారు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేయిస్తూ ఉండండి. చికెన్ పీసులు బంగారు రంగులోకి మారి.. బయట క్రంచీగా అయ్యే వరకు వేయించడం కొనసాగించండి. ఈ క్రంచీనెస్ వల్లే దీనికి పెళ్లిళ్ల స్టైల్ టచ్ వస్తుంది.

చివరగా అదే నూనెలో కొద్దిగా కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. ఆ వేయించిన కరివేపాకును రెడీగా ఉన్న చికెన్ లెగ్ పీస్‌ల పైన చల్లి సర్వ్ చేయండి. ఇంతే.. పెళ్లి విందుల్లో తినేలా క్రంచీ, రుచికరమైన చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇప్పుడు మీ ఇంట్లోనే సిద్ధం. వేడి వేడి‌గా సర్వ్ చేసి అందరినీ వావ్ అనిపించండి.