Vegetable Majjiga Pulusu: అమ్మమ్మ చేతి కమ్మని వంట వెజిటబుల్ మజ్జిగ పులుసు తయారీ విధానం

|

Jun 16, 2021 | 2:05 PM

Vegetable Majjiga Pulusu: ఆంధ్ర వంటల్లో ఫేమస్ మజ్జిగ పులుసు.. ఈజీగా పోపు వేసుకుని తయారు చేసుకోవచ్చు.. లేదా పూర్వం మన పెద్దలు తయారు చేసిన విధంగా కూరగాయలు...

Vegetable Majjiga Pulusu: అమ్మమ్మ చేతి కమ్మని వంట వెజిటబుల్ మజ్జిగ పులుసు తయారీ విధానం
Majjiga Pulusu
Follow us on

Vegetable Majjiga Pulusu: ఆంధ్ర వంటల్లో ఫేమస్ మజ్జిగ పులుసు.. ఈజీగా పోపు వేసుకుని తయారు చేసుకోవచ్చు.. లేదా పూర్వం మన పెద్దలు తయారు చేసిన విధంగా కూరగాయలు వేసి.. మజ్జిగ పులుసు చేసుకోవచ్చు.. ఈ రోజు వెజిటేబుల్ మజ్జిగ పులుసు తయారీ విధానం తెలుసుకుందాం..

తయారీకి కావాల్సిన పదార్ధాలు :

మజ్జిగ
ఆనపకాయ ముక్కలు
బెండకాయ ముక్కలు
టమాటా ముక్కలు
ముల్లంగి ముక్కలు
క్యారెట్ ముక్కలు
ములక్కాయ ముక్కలు
పచ్చి మిర్చి 4
ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా
కొత్తిమీర
కర్వేపాకు
శనగపిండి
పసుపు
నూనె
ఉప్పు -రుచికి సరిపడా

పోపుకు :

ఇంగువ
ఆవాలు
అల్లం చిన్న చిన్న ముక్కలు
జీలకర్ర
మినపప్పు
శనగపప్పు

వెజిటబుల్ మజ్జిగ పులుసు తయారీ విధానం:

అర లీటరు పుల్లని పెరుగు ని తీసుకుని సుమారు నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి నీటిలో ఉండలు లేకుండా కలిపి మజ్జిగ లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇంతలో కూరగాయ ముక్కలు అన్నిటిని ఓ గినెలో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. అందులో రెండు కర్వేపాకు రెమ్మలు వేసుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసి శనగపిండి కలిపినా మజ్జిగను ఆ కూరగాయ ముక్కల్లో వేసుకుని గ్యాస్ స్టౌ స్విమ్ లో పెట్టి మరగబెట్టుకోవాలి. అలా మరగబెట్టిన తర్వాత వేరే బర్నర్ మీద గిన్నె పెట్టి.. కొంచెం నూనె వేసి.. పోపు గింజలు , ఇంగువ వేసి వేయించాలి.. తర్వాత ఈ పోపును మరుగుతున్న మజ్జిగ పులుసులో వేసుకుని కొంచెం కొత్తిమీర వేసి.. ఒక రెండు నిముషాలు మరిగించి దింపేసుకోవాలి.. అంతే ఎంతో టేస్టీ టేస్టీ అమ్మమ్మ చేతి కమ్మని వంట కూరగాయల మజ్జిగ పులుసు రెడీ

Also Read: సింగపూర్‌లో చైనా వ్యక్తి ఎక్స్‌ట్రాలు.. భారతీయ సిబ్బందిపై తిట్లు.. చివరకు.

నల్లమల అడవీ ప్రాంతంలో మాత్రమే దొరికే భూ చక్ర గడ్డ .తింటే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో

.