ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అందుకు వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానమే కారణమని చెప్పుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంలో పోషకాలు సరిపడా లేకపోవడం కూడా వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆంశం. అయితే పోషకాలతో కూడిన దుంపకూరలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆలుగడ్డ, చిలగడదుంప, చామగడ్డతో పాటు ముల్లంగి వంటి దుంపకూరల్లో శరీరానికి కావలసిన ప్రోటీన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, కేలరీలు లభిస్తాయి. అయితే చాలామంది ఇష్టంగా తినే ముల్లంగి ముక్కలను సాంబారులో కనిపిస్తే అస్సలు వదలరు. అయితే, ఈ ముల్లంగి కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదండోయ్.. ఇందులో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. మనకు నిత్యం వండుకుని తినేందుకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. దీని ఘాటైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. అందుకని ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అందుకు దీని వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా ఒక కారణం. మరి ముల్లంగిని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం