Kokum Fruit: వేసవి కాలంలో ఉండే అధిక ఉష్టోగ్రతలు, అధిక వేడి నుంచి ఉపశమనం కోసం చల్లని పదార్ధాలను, ఆహారాలను తినడం తప్పనిసరి. ఈ సమయంలోనే వడదెబ్బ, డీ హైడ్రేషన్ వంటి సీజనల్ సమస్యల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకోసం జీరో క్యాలరీ డ్రిక్స్‌తో పాటు కొన్ని రకాల ఆహారాలు ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వేసవిలో లభించే సీజనల్ ఫ్రూట్స్ ఇంకా మెరుగ్గా ఉపయోగపడతాయని, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని వారు అంటున్నారు. అలా వేసవిలో లభించే పండ్లలో కోకుమ్ కూడా ఒకటి. ఇందులోని యాంటీఆక్సిడెంట్ మన శరీర వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇంకా కోకమ్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి3, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఎసిటిక్ యాసిడ్, హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్స్ కూడా ఉన్నాయి. మరి ఇన్ని పోషకాలు ఉన్న కోకుమ్‌ని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తి: కోకుమ్ పండు యాంటీ బాక్టీరియల్, యాంటీ-వైరల్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇది బ్యాక్టీరియా , వైరల్ ఇన్ఫెక్షన్‌ల నుంచి శరీరాన్ని రక్షించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని సహాయంతో పేగు అలెర్జీలను కూడా తగ్గించవచ్చని పలు అధ్యయనాలు నిరూపించాయి.
జీర్ణక్రియ: తీపిగా, చిక్కగా ఉండే కోకుమ్ షర్బత్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపకరిస్తుంది. అసిడిటీ, అజీర్ణంతో బాధపడుతున్న రోగులు ఈ డ్రింక్‌ని తాగడం వల్ల ఉపశమనం పొందుతారు. ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యం: కోకమ్‌లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. దీనిలోని మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి మినరల్స్ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఫలితంగా గుండెను రక్షించడంలో సహాయపడుతుంటాయి.
చర్మ సంరక్షణ: కోకుమ్ పండు ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో వృద్ధాప్య లక్షణాలను తగ్గించగల శక్తి ఇందులో ఉంది. డెడ్ స్కిన్స్, మొటిమలను తొలగించడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..