Roti Making Tips: చెఫ్ చెప్పిన ఈ చిట్కాలను పాటిస్తే రోటీలు పువ్వులా మెత్తగా ఉబ్బుతాయ్..

|

May 06, 2024 | 10:41 AM

ఈ ట్రిక్స్‌ పాటిస్తే.. రోటీ చేయడం ఇకపై ఎలాంటి శ్రమ అనిపించదు. ఈ సింపుల్‌ చిట్కాలతో అన్ని రోటీలు మెత్తగా, మృదువుగా పొంగి పొరలుగా వస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. మెత్తటి రోటీలను తయారు చేయడంలో మొత్తం రహస్యం పిండిని తడిపే దగ్గరే ఉంటుందని మీకు తెలుసా..?

Roti Making Tips: చెఫ్ చెప్పిన ఈ చిట్కాలను పాటిస్తే రోటీలు పువ్వులా మెత్తగా ఉబ్బుతాయ్..
రోజువారీ భోజనంలో అన్నంతో పాటు రొట్టెలు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. రొట్టె అంటే ప్రాథమికంగా గోధుమ పిండితో చేసిన రొట్టె అనే అందరూ అనుకుంటారు. కానీ చాలా మందికి గోధుమ రొట్టె తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గొంతు-ఛాతీ చికాకు, గొంతు సమస్యలు కూడా కనిపిస్తుంటాయి.
Follow us on

రోటీ తయారు చేయడం ఒక సవాలు. అందుకే చాలా సార్లు రోటీ తినాలనిపించినా, అదంతా ఎవరూ చేస్తారులే అనుకునని.. అన్నం తినేస్తుంటాం. రోటీలు తినడానికి ఎంతో రుచిగా, సరదాగా ఉంటుంది. కానీ, వాటిని తయారు చేయడమే పెద్ద ప్రహసనంగా ఉంటుంది. పిండిని ఎలా పడితే అలా పిసికి తయారు చేస్తే రోటీలు పొంగవు. పైగా త్వరగా గట్టిపడిపోతాయి. ఇక వాటిని తినడానికి కష్టపడాల్సి వస్తుంది. వాటిని జీర్ణం చేయడానికి కడుపు కూడా చాలా కష్టపడుతుంది. కాబట్టి, ఈ రోజు మనం రోటీ తయారీకి సంబంధించిన కొన్ని ఐడియాలు, చిట్కాలను మీతో పంచుకోబోతున్నాం. ఈ ట్రిక్స్‌ పాటిస్తే.. రోటీ చేయడం ఇకపై ఎలాంటి శ్రమ అనిపించదు. ఈ సింపుల్‌ చిట్కాలతో అన్ని రోటీలు మెత్తగా, మృదువుగా పొంగి పొరలుగా వస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. మెత్తటి రోటీలను తయారు చేయడంలో మొత్తం రహస్యం పిండిని తడిపే దగ్గరే ఉంటుందని మీకు తెలుసా..?

చెఫ్ పంకజ్ భదౌరియా తన సోషల్ మీడియాలో ఇటువంటి వంట చిట్కాలను పంచుకుంటారు. వంటని చాలా సులభంగా, సరదాగా చేయడానికి ఇలాంటి చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇటీవల అతను రోటీ తయారీకి ఎంతగానో ఉపయోగపడే చిట్కాలను పంచుకున్నారు.. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం…

రోటీ చేయడానికి పిండిని పిసికి కలుపుతున్నప్పుడు చల్లని నీరు కాకుండా, గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. దీని వల్ల చాలా తేడా వస్తుంది. అలాగే, నీరు కాకుండా మీరు పప్పు ఉడికించిన నీటి వాటిని ఉపయోగించి కూడా పిండిని తడుపుకోవచ్చు. ఈ నీరు కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న తర్వాత మాత్రమే వాడండి.

ఇవి కూడా చదవండి

పిండిని కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి. గట్టి పిండితో రోటీని తయారు చేయడం చాలా కష్టం. ఇలా చేస్తే చపాతీలు కూడా ఎక్కువ సేపు మెత్తగా ఉండదు.

రోటీ చేయడానికి కనీసం 20 నుండి 30 నిమిషాల ముందు పిండిని మెత్తగా తడుపుకోవాలి. దీనివల్ల రోటీలు మృదువుగా, బెలూన్ లాగా ఉబ్బుతాయి. 20-30 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత తయారు చేయడానికి ముందు చేతులతో తేలికపాటిగా మరోసారి పిండి కలపాలి.

రోటీలను తక్కువ మంట మీద ఉడికించాలి. ఎక్కువ మంట మీద చపాతీ కాల్చినప్పుడు అవి పొంగవు. అలాగే, ఐరన్‌ పాత్రలో రోటీని తయారు చేస్తుంటే, మరింత కేర్‌ఫుల్‌గా కాల్చుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..