బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ షుగర్ వంటి ఆహారాన్ని తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వైట్ షుగర్ కంటే.. బ్రౌన్ షుగర్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. అలాగే వైట్ షుగర్ ఎక్కువగా తీసుకోవడం వలన కేలరీలు పెరుగుతాయని.. బరువు కూడా పెరిగే అవకాశం ఉందని.. ఇక డయాబెటిక్ రోగులు దీనికి దూరంగా ఉండాలని వైద్యులు అంటుంటారు. అయితే వైట్ షుగర్‌తో పోలిస్తే బ్రౌన్ షుగర్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా.. ఇందులో పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. బ్రౌన్ షుగర్ నేరుగా బెల్లం నుంచి సేకరించింది. చెరుకు నుంచి తీసినది కాదు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచివి.
బ్రౌన్ షుగర్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు..
1. బ్రౌన్ షుగర్ తీసుకోవడం వలన జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది. అలాగే మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం ముక్క, ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలిసి తీసుకోవాలి.
2. తిమ్మిర్లను తగ్గించడానికి బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాళ్ల తిమ్మిరిని తగించడంతోపాటు.. నొప్పిని తగ్గిస్తుంది.
3. బరువు తగ్గడానికి బ్రౌన్ షుగర్ పనిచేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి. అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి బ్రౌన్ షుగర్ బెస్ట్ పుడ్.
4. ఇందులో విటమిన్ బి6, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్గా పనిచేస్తాయి. అలాగే చర్మంపై మృత కణాలను తొలగించి స్క్రబ్‌గా పనిచేస్తాయి.
4. బ్రౌన్ షుగర్ యాంటీ అలెర్జీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అనారోగ్య చికిత్సలో ఉబ్బసం రోగులకు సహాయపడుతుంది.
5. బ్రౌన్ షుగర్ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే యాంటీ ఇన్ల్పమేటరీ, యాంటీ బాక్టీరియల్ అంశాలను కలిగి ఉంటుంది.
Also Read: Venkatesh: “నారప్ప” సినిమాకు తీవ్రంగా శ్రమించా.. అయినా ఇలా.. అభిమానులకు క్షమాపలు చెప్పిన వెంకటేశ్..
అడుగులు వేయకముందే స్విమ్మింగ్ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..