Biotin Effect: ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. దీని వల్ల జుట్టు పల్చగా, బలహీనంగా మారి నిర్జీవంగా కనిపిస్తుంది. అంతేకాదు అతిగా జుట్టు ఊడిపోయి బట్టతల కనిపిస్తోంది. అయితే అనారోగ్యకరమైన జుట్టు ఎప్పుడైనా మనం తినే తప్పుడు ఆహార ఫలితమని గుర్తుంచుకోండి. ఇది కాకుండా కొన్నిసార్లు ఏదైనా వ్యాధి లేదా మందుల దుష్ప్రభావాల కారణంగా కూడా జుట్టు ఊడిపోతుంది. వాస్తవానికి చాలాసార్లు బయోటిన్ లోపం వల్ల జుట్టు రాలుతుంది. బయోటిన్ ఒక విటమిన్ ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది చర్మం గ్లో, గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మన శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఈ విటమిన్ పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇది బి విటమిన్ల కుటుంబంలో భాగంగా పరిగణిస్తారు. చాలా మందికి విటమిన్ హెచ్ అనే పేరు కూడా తెలుసు. బయోటిన్ శరీరంలో కెరాటిన్ అనే ప్రోటీన్‌ని మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, అందంగా, దృఢంగా ఉండాలంటే చాలామంది కెరాటిన్ లేదా మరేదైనా హెయిర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. కానీ ఈ చికిత్సలు ఖరీదైనవి. అలాగే వాటి ప్రభావం కూడా తాత్కాలికంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు ఆహారంలో కొన్ని బయోటిన్‌లను చేర్చుకుంటే మీ సమస్య సులువుగా నయమవుతుంది.
1. చిలగడదుంప
చిలగడదుంపల్లో బయోటిన్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా మీ శరీరంలోని బయోటిన్ లోపం తొలగిపోతుంది. దీంతో పాటు మీ శరీరంలో ఐరన్ లోపం కూడా కవర్ అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది.
2. పుట్టగొడుగులు
పిజ్జా లేదా నూడుల్స్‌పై టాపింగ్స్‌గా ఉపయోగించే పుట్టగొడుగులలో కూడా గణనీయమైన స్థాయిలో బయోటిన్ ఉంటుంది. పుట్టగొడుగులలో విటమిన్ డి, ప్రొటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
3. పాలకూర
ఐరన్, విటమిన్లు, మినరల్స్, ఫైబర్, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉండే బచ్చలికూర తీసుకోవడం వల్ల మీ శరీరంలో బయోటిన్ లోపాన్ని తొలగించవచ్చు. అలాగే ఇది మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది.
4. అరటిపండ్లు
ఒక వ్యక్తి రోజూ ఒక అరటిపండు తింటే అతని శరీరంలోని అనేక రకాల సమస్యలను అధిగమించవచ్చు. అరటిపండులో పిండి పదార్థాలు, ఫైబర్, విటమిన్ బి, కాపర్, పొటాషియం, బయోటిన్ పుష్కలంగా లభిస్తాయి. అరటిపండును రోజూ తీసుకోవడంతో పాటు జుట్టుకు ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు.