AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేప ఆకులు మాత్రమే కాదు.. పువ్వుతో కూడా పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలాంటి సమస్యకు దివ్యౌషధం..!

చిక్కటి మిశ్రమాన్ని తయారు చేసుకుని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తగ్గిపోతాయి. అలాగే చర్మం దురద సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి. బ్లాక్‌ హెడ్స్ ని తగ్గిస్తుంది. అంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్న వేప పువ్వును ఇకపై నిర్లక్ష్యం చేయకండి.. రోజూ వేప పువ్వు టీ తాగడం అలవాటు చేసుకోండి. తద్వారా మీరు క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. 

వేప ఆకులు మాత్రమే కాదు.. పువ్వుతో కూడా పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఇలాంటి సమస్యకు దివ్యౌషధం..!
Neem Flower Tea
Jyothi Gadda
|

Updated on: Oct 24, 2023 | 6:55 PM

Share

వేప చెట్టు గురించి మనందరికీ తెలుసు. వేపచెట్టులోని ప్రతి భాగం మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. వేప చెట్టు గాలి కూడా ఎంతో స్వచ్చమైనది. అయితే, వేప చెట్టు పువ్వు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా..? ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఉగాది పచ్చడిలో వేప పువ్వును వేసుకొని తింటాము. అలాంటి వేప పువ్వు తింటే శరీరం వజ్రంలా మారుతుందని తరచూ పెద్దలు చెబుతుంటారు.. అలాంటి వేప పువ్వులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి వేప పువ్వు టీని తీసుకోవచ్చు. అయితే, ఈ టీని తయారు చేయడానికి మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు తాజా వేప పూలను తీసుకోండి. ఇప్పుడు ఈ పువ్వులను బాగా కడగాలి. దీని తర్వాత 1 కప్పు నీటిలో బాగా మరిగించాలి. అంతే వేప పువ్వు టీ రెడీ అయినట్టే..ఈ టీని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీర బరువు తగ్గుతుంది.

వేప పూలను తేనెతో కలిపి వాడితే పొట్ట కొవ్వు కరిగిపోతుంది. వేప పూలు, తేనె కలిపి వాడితే బరువు తగ్గుతారు. మీ శరీర బరువును త్వరగా తగ్గించడంలో ఈ రెండింటి కలయిక చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించడానికి, కొన్ని వేప పువ్వులను తీసుకుని వాటిని బాగా రుబ్బుకోవాలి. దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే పొట్ట కొవ్వు త్వరగా తగ్గుతుంది. దీనితో పాటు, మీరు వేప టీలో నిమ్మకాయను కూడా కలిపి తీసుకొవచ్చు.

ఇవి కూడా చదవండి

వేప పువ్వులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంలో జిడ్డును దూరం చేస్తుంది. పొడిబారిన చర్మాన్ని దూరం చేస్తుంది. వేప పువ్వు జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. వేప పువ్వు పొడిని నీళ్లలో కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారు చేసుకుని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తగ్గిపోతాయి. అలాగే చర్మం దురద సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి. బ్లాక్‌ హెడ్స్ ని తగ్గిస్తుంది. అంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్న వేప పువ్వును ఇకపై నిర్లక్ష్యం చేయకండి.. రోజూ వేప పువ్వు టీ తాగడం అలవాటు చేసుకోండి. తద్వారా మీరు క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
గణేశుడి 32 రూపాలు.. ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
గణేశుడి 32 రూపాలు.. ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా?
బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా?
పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. ఎందుకంటే?
పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. ఎందుకంటే?
11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!
11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!