Funny Video: కోతికి తిండిపెట్టబోయిన అమ్మాయి.. దిమ్మ తిరిగే షాకిచ్చిన వానరం.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..!
కోతికి ఆహారం పెడుతున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాలని భావించిన ఓ యువతి తన స్నేహితులతో కలిసి వెళ్లి కోతికి ఆహారం పెట్టాలని చూసింది. అందుకోసం ఆమె వెంట తెచ్చిన ఆహారాన్ని కోతికి చూపించింది.. అది చూసి కోతి వెంటనే వచ్చి చిరుతిండి తింటుందిలే అనుకుంది.. కానీ, ఆ కోతి వాళ్లకి ఊహించని షాక్ ఇచ్చింది. కోతి నుంచి అనూహ్య స్పందన రావడంతో ఆ యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
కొందరు చేసే అల్లరి పనులు చిరాకు తెప్పిస్తాయి..అలాంటివారిపై కోపంగా ఏంటా కోతి వేషాలు అంటూ నిందిస్తుటారు. ఎవరిమీదనైనా కోపం ప్రదర్శిస్తే.. ఏంటీ కళ్లు తాగిన కోతిలాగా ఆ చిందులు అంటుంటారు. ఎందుకంటే.. వానర చేష్టలు ఎప్పుడు మనుషులకు విసుగు పుట్టించేవిగానే ఉంటాయి. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా కోతులు గుంపులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇళ్లు, పంటపొలాల్లోకి చొరబడుతున్న కోతులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కోతుల దాడులతో కొందరు గాయపడుతుంటే.. కొందరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇదంతా సరేగానీ, ఇప్పుడెందుకీ కోతి పురాణం అని అనుకుంటున్నారేమో.. అవును మరీ.. ఇక్కడ ఓ వానరం చేసిన అల్లరి పని ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మంకీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.. కోతులతో ఆకట్టుకునే రీల్స్‌ను రూపొందించిన చాలా మంది యూట్యూబర్‌లను మీరు చూసి ఉంటారు. చాలా వీడియోలు ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. రీల్స్ వీడియోలలో మీరు కోతులు మనుషుల్లా ప్రవర్తించడం, మనుషుల మాటలు వినడం చూస్తారు. అయితే అన్ని కోతులు ఒకేలా ఉండవు.. కొన్ని కోతులు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. కొన్ని కోతులు మీపై కోపంగా కూడా ఉంటాయి. మళ్లి అదే కోతి పురాణం.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానా అని మీరు అనుకుంటున్నారు కదా..? అయితే ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూడాల్సిందే…
View this post on Instagram
కోతి లక్షణాల గురించి ఇంత పరిచయం ఎందుకు ఇచ్చామో ఇప్పుడు అర్థమైందా? అదీ విషయం. కోతికి ఆహారం పెడుతున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాలని భావించిన ఓ యువతి తన స్నేహితులతో కలిసి వెళ్లి కోతికి ఆహారం పెట్టాలని చూసింది. అందుకోసం ఆమె వెంట తెచ్చిన ఆహారాన్ని కోతికి చూపించింది.. అది చూసి కోతి వెంటనే వచ్చి చిరుతిండి తింటుందిలే అనుకుంది.. కానీ, ఆ కోతి వాళ్లకి ఊహించని షాక్ ఇచ్చింది. కోతి నుంచి అనూహ్య స్పందన రావడంతో ఆ యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దృశ్యాన్నంతా అమ్మాయి స్నేహితులు తమ మొబైల్ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..