How to Store Bananas : అరటిపండు బలవర్ధకమైన ఆహారం.. ఇక సర్వసాధారణంగా అందరికీ అనుకూలమైన ధరలో దొరకడంతో అరటిపండుని తినడానికి అందరూ ఆసక్తిని చూపిస్తారు. ఎన్నో పోషకాలతో ఆరోగ్యాన్ని ఇచ్చే అరటి పండు మనకి ఏడాది పొడవునా దొరుకుతుంది. ఈ పండుని తిన్న తక్షణం శక్తినిస్తుంది. అలాంటి ఎనర్జీ బూస్ట్ ని ఇచ్చే పండు ఇంకేదీ లేదు. అరటి పండు ఇంట్లో ఉంటే తల్లులకి కూడా హాయే. ఆకలి అన్న పిల్లలకి ఒక పండు చేతిలో పెట్టేస్తే చాలు. ఇంత తేలికగా తినగలిగే పండు కూడా ఇదొక్కటే. అయితే అరటి పండ్లను ఎంత తాజాగా తెచ్చినా ఇంట్లో రెండు రోజులకే మచ్చలు వచ్చేస్తాయి. తరువాత నల్లబడతాయి. ఆ వెంటనే పాడైపోతాయి. అందుకనే వీటిని ఎక్కువగా కొనుక్కొని నిల్వ చేసుకోవడం కొంచెం కష్టమైన పని.. అరటిపండ్లను ఫ్రిజ్‌లో స్టోర్ చేసినా అవి త్వరగా నల్లగా మారిపోతాయి. అయితే అరటిపండును నిల్వ చేసినప్పుడు అవి త్వరగా పాడవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..!
అరటిపండ్లను ఇంటికి తీసుకొచ్చిన వెంటనే వాటిని అస్తం నుంచి ఒకొక్కటిగా విడదీయండి. అలా విడివిడిగా ఉన్నప్పుడు అరటిపండు డు త్వరగా పాడవదు. అల్యూమినియం ఫాయిల్ లో అరటి పండు చుట్టుకున్నా పాడవదు. అంతేకాదు.. ఏదైనా న్యూస్ పేపర్ లో అరటిపండ్లను చుట్టినా అవి పాడవకుండా నిల్వ ఉంటాయి.
Also Read: Vakeel Saab : పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన చిత్ర యూనిట్