స్వీట్ పొటాటో దీనినే మనం చిలగడ దుంప అని కూడా అంటాం. ఫైబర్ ఇంకా విటమిన్ బి 6 అధికంగా ఉండే చిలగడదుంపలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే చిలగడదుంప రోగనిరోధక శక్తిని అందించడమే కాదు ఎముకలు , దంతాల ఆరోగ్యాన్ని పెంచుతాయి.
చిలకడ దుంప.. ఈ తియ్యని దుంపను ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. నోటిలో పెట్టుకోగానే.. తియ్యగా కరిగిపోయే ఈ దుంపలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలతోపాటు చక్కెర శాతంగా కూడా ఎక్కువే. ఈ దుంప శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం హృదయ స్పందనలు, నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్ల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని చూస్తున్నారా? అయితే, విటమిన్-D ఉన్న చిలకడ దుంపలను తినండి. ఇది క్యాన్సర్ కారకాల నుంచి కూడా కాపాడుతుంది. పొటాటో చిప్స్ కు బదులు స్వీట్ పొటాటో చిప్స్ ఎంచుకోండి. ఆలూ చిప్స్ చేసే హానికి దూరంగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాలను అధికంగా ఉత్పత్తి చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలకడ దుంప మానసిక ఆందోళనలు తగ్గించేందుకు తోడ్పడుతుంది. కరోనా సీజన్ కాబట్టి.. చిలకడ దుంపను ఆహారంగా తీసుకోవడం తప్పనిసరి చేయండి.
Also Read:
ద్యేవుడా.! ఆ రైల్వే స్టేషన్ మన దేశంలోనే.. అక్కడికి వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా అవసరం..
సింహాల గుంపు చుట్టుముడితే ఎట్టుంటుందో తెలుసా.? వైరల్ వీడియో మీకోసమే!
కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చాడు.. స్కాన్ చేసిన డాక్టర్లకు ఫ్యూజులు ఔట్.. అసలేమైందంటే!
బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా.? అయితే ఈ షాకింగ్ విషయాలు మీకోసమే..