Vitamin Deficiency: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే.. లేదంటే ప్రమాదమే

|

Oct 11, 2022 | 9:04 PM

విటమిన్ E శరీరానికి ఎంతో అవసరం. శరీరంలో ఈ విటమిన్ లోపం ఉంటే ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. అందుకే కొన్ని లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తగా పడాలి.

Vitamin Deficiency: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే.. లేదంటే ప్రమాదమే
Body Pains
Follow us on

ప్రతి విటమిన్ శరీరానికి అవసరం. విటమిన్ శరీరానికి అందకపోతే, అనేక వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయి. దీంతో అనేక సమస్యలు చుట్టుముడుతాయి. ముఖ్యంగా విటమిన్ ఇ శరీరానికి ఎంతో అవసరం. శరీరంలో ఈ విటమిన్ లోపం ఉంటే, అనేక సమస్యలు మొదలవుతాయి. ఈరోజు మనం కొన్ని లక్షణాల గురించి తెలుసుకోబోతున్నాం. సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ లక్షణాలు చాలా తీవ్రంగా మారతాయి. ఇవి మనుషులను చాలా ఇబ్బంది పెడతాయి. ఇటువంటి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్తగా ఉండొద్దు..

కండరాల బలహీనత

ఇవి కూడా చదవండి

స్పష్టంగా కనిపించకపోవడం

అలసినట్లుగా అనిపించడం

అధికంగా జుట్టు కోల్పోవడం

జీర్ణం కావడంలో ఇబ్బందులు

చర్మం పొడిబారడం

పగిలిన పెదవులు లేదా నోటిలో పగుళ్లు

రోగనిరోధక శక్తి బలహీనపడటం

అధిక ఒత్తిడి

విటమిన్ ఇ కావాలంటే ఇవి తినాలి..

బచ్చలికూర, గుడ్లు, బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజలు, వాల్‌నట్‌లు, పచ్చి ఆకు కూరలు, బ్రోకలీ, మామిడి, బొప్పాయి, సోయాబీన్ నూనెలు విటమిన్ ఇకి మంచి వనరులు.

శరీరంలో ఏదైనా విటమిన్ సమతుల్య స్థాయిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇది తక్కువగా ఉంటే అనేక రోగాలు చుట్టుముడతాయి. అది ఎక్కువగా ఉంటే ఇతర సమస్యలు కూడా వస్తాయి. విటమిన్ ఇ విషయంలో కూడా అదే జరుగుతుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం లేదా శరీరంలో ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తస్రావం, అలసట వంటి అనేక సమస్యలు వస్తాయి. విటమిన్ E సమతుల్య మోతాదు కోసం డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోవాలి. ఇటువంటి చికిత్స, మందులు, ఆహారం పాటించాలని అనుకుంటే ముందుగా డాక్టర్‌ని సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.