Health tips: బ‌చ్చ‌లికూర నిజంగా బంగార‌మే.. ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఆరోగ్య లా‌భాలు.. డోంట్ మిస్‌?

|

Nov 23, 2022 | 4:16 PM

అనేక పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. రోజూ ఒక కప్పు ఈ ఆకు కూర తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Health tips: బ‌చ్చ‌లికూర నిజంగా బంగార‌మే.. ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఆరోగ్య లా‌భాలు.. డోంట్ మిస్‌?
బచ్చలికూర తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కావున జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బచ్చలికూరను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Follow us on

చలికాలం వచ్చిందంటే చాలు ప్రజలు రకరకాల ఆహారపదార్థాలను రుచిచూడటానికి ఇష్టపడతారు. గరం గరం మిర్చి బజ్జీలు మొదలు..చిల్లీ ఫ్రైడ్ ఫుడ్స్ చాలా మందికి చాలా ఇష్టం. కానీ శరీరంలో జీవక్రియ రేటు వేసవిలో కంటే శీతాకాలంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి, చలికాలంలో ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఇక చలికాలంలో వ్యాయామం చేయడానికి చాలా మంది బద్దకిస్తుంటారు. సోమరితనంతో శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతాయి. అయితే, మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. అందులో ముఖ్యంగా బచ్చలికూరను ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. బచ్చలికూర అనేక పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. బచ్చలికూర తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం…

రక్తహీనతను తగ్గిస్తుంది:
మీకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే లేదా మీ శరీరంలో ఐరన్‌ లోపం ఉంటే మీరు మీ ఆహారంలో బచ్చలికూరను చేర్చుకోవడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ శరీరంలోని ఐరన్, పొటాషియం వంటి పోషకాల లోపాన్ని తీర్చడంలో బచ్చలికూర చాలా మేలు చేస్తుంది. బచ్చలికూరతో పాటు, మీరు ఇతర ఆకుపచ్చ కూరగాయలను భోజనంలో చేర్చుకోవచ్చు.

రక్తపోటు సమస్య:
మీకు గుండె సంబంధిత సమస్యలు ఉంటే బచ్చలికూర మీ రక్తపోటును నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. పాలకూరలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది రక్తపోటు స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అందుకే బచ్చలికూర తీసుకోవడం వల్ల గుండె సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కంటి సమస్యల నివారణగా :
బచ్చలికూరలో జియాక్సంతిన్, లుటిన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. మీరు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, బచ్చలికూరను తప్పకుండా తినండి.

ఎముకల దృఢత్వానికి:
బచ్చలికూరలో విటమిన్-కె, పొటాషియం, కాల్షియం, అనేక ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. రోజూ ఒక కప్పు బచ్చలికూర తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి