Milk Dates Benefits : పాలలో 2 ఖర్జురాలు నానబెట్టి తింటే ఆ శక్తి అమాంతం పెరుగుతుంది..!

|

Aug 15, 2021 | 4:59 PM

Milk Dates Benefits : మీరు శారీరక బలహీనతతో బాధపడుతుంటే పాలలో 2 ఖర్జూరాలు నానబెట్టి తినండి. క్రమం తప్పకుండా

Milk Dates Benefits : పాలలో 2 ఖర్జురాలు నానబెట్టి తింటే ఆ శక్తి అమాంతం పెరుగుతుంది..!
Milk Dates Benefits
Follow us on

Milk Dates Benefits : మీరు శారీరక బలహీనతతో బాధపడుతుంటే పాలలో 2 ఖర్జూరాలు నానబెట్టి తినండి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ముఖ్యంగా పురుషుల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణులు పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. అయితే ఖర్జూర కూడా సూపర్ ఫుడ్ కేటగిరీలోకి వస్తుంది. ఈ రెండు కలిపి తింటే శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

ఆయుర్వేద వైద్యుల ప్రకారం.. కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉండే పాలు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉండే ఖర్జూరాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీరు అనేక వ్యాధులకు దూరంగా ఉంటారు. ఖర్జూరాలను పాలలో నానబెట్టి తిన్నప్పుడు దాని ఆరోగ్య ప్రయోజనాలు 100 రెట్లు పెరుగుతాయి. వీటిని తీసుకోవడం ద్వారా రక్తహీనత వంటి వ్యాధులు నయమవుతాయి.

పాలు, ఖర్జూర ప్రయోజనాలు..

1. మహిళలు గర్భధారణ సమయంలో పాలు, ఖర్జూరాలు కలిపి తీసుకోవడం వల్ల శక్తిని పొందుతారు. ఖర్జూరాలు తల్లి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పిండం అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఆవు పాలలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకుంటే శరీరంలో ఆక్సిటోసిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది డెలివరీ సమయంలో గర్భాశయం సున్నితత్వాన్ని పెంచడానికి పనిచేస్తుంది.

2. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. ఖర్జూరాలలో యాంటీ ఏక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. వృద్ధాప్య ఛాయలను రానివ్వకుండా చేస్తుంది.

3. ఎవరైనా ఐరన్ లోపంతో బాధపడుతుంటే పాలలో ఖర్జూర నానబెట్టుకొని తినాలి. ఈ సమస్య వెంటనే పరిష్కార మవుతుంది.

4. ఆయుర్వేదంలో ఖర్జూరాలను ఔషధంగా భావిస్తారు. ఇది పురుషుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరాలు, పాలను కలిపి తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది. ప్రతిరోజూ రెండు లేదా మూడు పొడి ఖర్జూరాలను పాలలో నానబెట్టి తింటే బలంతో పాటు వీర్య వృద్ధి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం మీ శరీరంలో చక్కెరను నియంత్రిస్తుంది. దీని వల్ల మీరు డయాబెటిస్ వంటి సమస్యలను నివారించవచ్చు. రాత్రి పడుకునే ముందు పాలు, ఖర్జూరాలు తినవచ్చు.

EPF : పీఎఫ్ ఖాతాదారులకు గమనిక..! ఈ 6 పరిస్థితులలో డబ్బు విత్ డ్రా చేయాలంటే కచ్చితంగా ఇది అవసరం..

IND vs ENG 2nd Test: ఆగస్టు 15న జరిగిన టెస్టుల్లో టీమిండియా 5వ సారి బ్యాటింగ్.. పేలవ రికార్డులు.. లార్డ్స్‌లో అదే జరగనుందా?

Rice Fortification: బియ్యం..వంట నూనెలకు విటమిన్లు జోడించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు అనర్థదాయకం అంటూ మేధావుల లేఖ!