ఇడ్లీలు దూదిల్లా మెత్తగా రావాలంటే ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు.. నోట్లో పెడితే కరిగిపోతాయి!

చాలామంది ఇడ్లీలు తయారు చేసుకునే సమయంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు పడుతూ ఉంటారు. దీంతో ఇడ్లీలు రాల్లలా గట్టిగా వస్తుంటాయి. అలాగే, మరి కొంతమంది అయితే ఎక్కువ రవ్వ వేసుకుంటూ ఉంటారు. ఇడ్లీలు దూదిలా రావాలంటే తప్పకుండా కొలతలు పాటిస్తూ పిండిని తయారు చేసుకోవడం మంచిది..ముఖ్యంగా ఇడ్లీలు మెత్తగా ఉండాలనుకుంటే తప్పకుండా పిండి బ్యాటరీ తయారు చేసుకునే క్రమంలో కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.

ఇడ్లీలు దూదిల్లా మెత్తగా రావాలంటే ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు.. నోట్లో పెడితే కరిగిపోతాయి!
Idly Recipe

Updated on: Oct 22, 2025 | 5:05 PM

ఇడ్లీలు మెత్తగా రావాలంటే రెండు కప్పుల ఇడ్లీ రవ్వకు తప్పకుండా ఒక కప్పు మినప్పప్పు వేయాల్సి ఉంటుంది. ఇడ్లీల మెత్తదనం అనేది మినప్పప్పు నాణ్యత పై కూడా ఆధారపడి ఉంటుంది. మంచి నాణ్యత కలిగిన మినప్పప్పు ఇడ్లీల్లో వినియోగిస్తే చాలా మెత్తగా వస్తాయి. ఇడ్లీలు మెత్తగా ఉండాలంటే తప్పకుండా పొట్టు తీసిన మినప గుండ్లు వాడడం మంచిది. అలాగే ఇడ్లీ రవ్వను తప్పకుండా ఆరు గంటల పాటు నానబెట్టుకోండి. మినపప్పును నానబెట్టినప్పుడే, ఒక టీ స్పూన్‌ మెంతులు కూడా అందులో వేసి నానబెట్టుకోవాలి. మెంతులు వేయటం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

ఇడ్లీ రవ్వ ను నానబెట్టుకున్న సమయంలోనే వేరుగా మరొక బౌల్లో తప్పకుండా మినప పప్పును కూడా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో నానిన మినప్పప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దికొద్దిగా చల్లటి నీళ్లు పోస్తూ మినప్పప్పు మెత్తగా​ గ్రైండ్​ చేసుకోవాలి. ఇడ్లీ పిండి మరీ పల్చగా, గట్టిగా ఉండకుండా నీళ్లను యాడ్​ చేసుకోవాలి. మినప్పప్పును మెత్తగా వెన్నెల మృదువుగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. అలాగే నానబెట్టిన ఇడ్లీ రవ్వను కడిగి రుబ్బుకున్న పిండిలో వేసుకొని మరికొద్ది సేపు నానబెట్టుకోండి.

బాగా పులిసిపోయిన తర్వాత పిండిని.. ఇడ్లీ పాత్రల్లో వేసుకుని ఇడ్లీలు పెట్టుకోండి.. ఈ విధంగా పక్కా కొలతలు, సింపుల్‌ టిప్స్‌ పాటిస్తూ మీరు ఇడ్లీ పిండి ప్రిపేర్​ చేసుకుంటే మెత్తని ఇడ్లీలు తప్పకుండా వస్తాయి. ఎన్ని ఇడ్లీలైనా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..