Tomato Coriander Rice:రోజు ఒకే రకం ఆహారం తినాలంటే పెద్దవారికే బోర్ అనిపిస్తుంది. ఇక ఇప్పటి తరం పిల్లల గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అమ్మ ఈరోజు ఏమి వంట చేయాలి అనగానే రెస్టారెంట్(Restarent) కు వెళ్దాం అని ఆశగా అనేస్తారు పిల్లలు. అందుకనే ఇంట్లో కూడా అప్పుడప్పుడు రెగ్యులర్ ఫుడ్ కి బదులు డిఫరెంట్ స్టైల్ ఫుడ్ ని తయారు చేస్తూ ఉంటె.. పిల్లలు తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ టమాటా కొత్తిమీర రైస్(tomato coriander rice) తయారు గురించి తెలుసుకుందాం.
కావల్సిన పదార్ధాలు:
అన్నం
టమాటాలు
కొత్తిమీర
లవంగాలు
దాల్చిన చెక్క
యాలకులు
బిర్యానీ ఆకు
జీలకర్ర
వెల్లుల్లి రెబ్బలు
నూనె
నెయ్యి
ఉల్లిపాయ
పచ్చిమిర్చి
కొత్తిమీర
కరివేపాకు
ధనియాల పొడి
జీడిపప్పు
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి.. కొంచెం వేడి చేసి.. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. వేడి అయ్యాక అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించుకుని తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వేయించండి. ఇప్పుడు కట్ చేసిన పచ్చి మిర్చి వేసి.. మరికొంచెం సేపు వేయించండి.. ఇప్పు ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసి.. వేసి వేగిన తర్వాత కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించండి. ఇంతలో కొత్తిమీర శుభ్రం చేసుకుని మిక్సీలో వేసి.. పేస్ట్ గా పట్టుకోండి. దీనిని మసాలా మిశ్రమంలో వేసి.. పచ్చి స్మెల్ పోయేవరకూ వేయించుకోండి. ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇప్పుడు రెండు టమాటాలను తీసుకుని ముక్కలుగా కట్ చేసి.. కొత్తిమీర మసాలా మిశ్రమంలో వేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలిపి గిన్నె మీద మూత పెట్టి.. టమోటా ముక్కలు బాగా మగ్గే వరకు వేయించుకోండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుని బాగా కలిపి.. చివరిగా ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి బాగా కలపండి. చివరిగా కొత్తిమీర వేస్తే.. ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా రైస్ రెడీ . దీనిని రైతా తో తినవచ్చు లేదా అలా కూడా తినవచ్చు.
Also Read: