AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంకుమ పువ్వును ఎక్కువగా వాడుతున్నారా..? అతిగా తింటే ఏమౌతుందో తెలిస్తే..

కుంకుమ పువ్వు ఆహారం రుచి, వాసనను పెంచుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కుంకుమ పువ్వు వాడకం శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యానిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారి, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. అయితే, ఏదైనా సరే అతిగా తినటం అనర్థమే అవుతుంది అంటారు. అలాగే, కుంకుమపువ్వు కూడా ఎక్కువగా తింటే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కుంకుమ పువ్వును ఎక్కువగా వాడుతున్నారా..? అతిగా తింటే ఏమౌతుందో తెలిస్తే..
Saffron Flower
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2025 | 7:23 PM

Share

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసు కుంకుమపువ్వు. అంతేకాదు.. దాని ఖరీదుకు తగినట్టుగానే, ఇతర మసాలా దినుసుల కంటే కుంకుమపువ్వు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ. కుంకుమపువ్వులో క్యాల్షియం, విటమిన్ ఇ, విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆహారం రుచి, వాసనను పెంచుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కుంకుమ పువ్వు వాడకం శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యానిస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారి, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. అయితే, ఏదైనా సరే అతిగా తినటం అనర్థమే అవుతుంది అంటారు. అలాగే, కుంకుమపువ్వు కూడా ఎక్కువగా తింటే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుంకుమపువ్వును ఎక్కువగా తీసుకోవటం వల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయని చెబుతున్నారు. అలాగే, శరీరంలో రక్తపోటు తగ్గుతుంది. కుంకుమపువ్వు అధికంగా తీసుకోవడం వల్ల బైపోలార్ డిజార్డర్ వచ్చే ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు సైతం వెల్లడించాయి. అందుకే ఇలాంటి తీవ్రమైన సమస్యను నివారించడానికి మీరు కుంకుమపువ్వు తక్కువ మోతాదులోనే తినాలని సూచిస్తున్నారు.

కుంకుమపువ్వును ఎక్కువగా వాడటం వల్ల శరీరంలోని యాంటిజెన్లను ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఒక్కొసారి కుంకుమపువ్వు అతిగా తీసుకోవటం వల్ల ముక్కు నుండి రక్తం వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కనురెప్పలు, పెదవులు మొద్దుబారిపోతాయని అంటున్నారు. అందుకే తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు